హ్యాండ్ ఇచ్చిన అఖిల ప్రియ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-25 18:57:55

హ్యాండ్ ఇచ్చిన అఖిల ప్రియ‌

ఎన్నో ఏళ్ల  నుంచి కర్నూల్ జిల్లా రాజకీయాలను శాసిస్తోంది భూమా ఫ్యామిలీ...అయితే  శోభా నాగిరెడ్డి, భూమా నాగి రెడ్డి అకాల మరణం తర్వాత ఎన్న‌డూ లేని విధంగా నంద్యాల, ఆళ్లగడ్డ రాజకీయాల్లో విప‌రీతంగా ఆధిపత్యపోరు తెర‌పైకి వ‌చ్చింది... ముఖ్యంగా భూమా కుటుంబానికి న‌మ్మిన బంటు, ప్ర‌ధాన అనుచ‌రుడుగా ఉన్న‌ ఏవీ సుబ్బారెడ్డికి భూమా నాగిరెడ్డి కుమార్తె టీడీపీ ప‌ర్యాట‌క శాఖా మంత్రి అఖిల ప్రియల‌ మ‌ధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.
 
గ‌తంలో కూడా ఆళ్ల‌గ‌డ్డలో ఆదిప‌త్యం  కోసం సుబ్బారెడ్డికి, అఖిల ప్రియలకు మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి.. కానీ ఈ వ్య‌వ‌హారంలోకి సీఎం చంద్ర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో ఈ గొడ‌వ కాస్త త‌గ్గు ముఖం ప‌ట్టింది... ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సూచ‌న‌ల మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు సైకిల్ యాత్ర‌ను చేప‌ట్టారు...
 
అయితే ఈ క్ర‌మంలో ఆళ్ల‌గ‌డ్డ‌లో ఏవీ సుబ్బారెడ్డి  సైకిల్ యాత్ర‌ను కొన‌సాగించారు... దీంతో  కాపు  సైకిల్ పై  వెళ్తున్న‌ సుబ్బారెడ్డి పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రాళ్ల‌తో దాడి చేశారు... ఈ దాడిలో సుబ్బారెడ్డికి ఆయ‌న అనుచ‌రుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
 
అయితే త‌న‌పై మంత్రి అఖిల ప్రియ త‌న అనుచ‌రుల‌తో కావాల‌నే దాడి చేయిస్తోందని ఆమె పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు సుబ్బారెడ్డి... దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య‌ విభేదలు మ‌ళ్లీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు దృష్టికి వెళ్లాయి.... దీంతో చంద్ర‌బాబు వెంట‌నే సుబ్బారెడ్డిని మంత్రి అఖిల ప్రియ‌ను అమ‌రావ‌తికి రావాల‌ని ఆదేశించారు.
 
అయితే పార్టీ అధినేత సూచ‌న‌ల మేర‌కు ఏవీ సుబ్బారెడ్డి  అమరావతి చేరుకున్నారు...కానీ మంత్రి అఖిల ప్రియ మాత్రం  ఈ సమావేశానికి సంబంధించి తనకు సమాచారం అందలేదని ఆళ్ల‌గ‌డ్డ‌లోనే ఉండిపోయారు... దీంతో చంద్ర‌బాబు ఆగ్ర‌హం చెందిన‌ట్లు తెలుస్తోంది.... అయితే మ‌రోవైపు పార్టీ అధినేత అమ‌రావ‌తికి రావాల‌ని ఆదేశించినా కూడా అఖిల ప్రియ డుమ్మాకొట్ట‌డం పై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుత‌న్నాయి... ఈ దాడి అఖిల ఆధ్వ‌ర్యంలోనే జ‌రిగి ఉంటుంద‌ని, లేక‌పోతే ఎందుకు అమ‌రావ‌తికి వెళ్ల‌లేద‌ని జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.