మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తా?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp minister ayyannapathrudu
Updated:  2018-04-02 05:22:49

మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తా?

అధికార తెలుగుదేశం పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఇటీవ‌ల అనంతపురం ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రికి  మాజీ ఎంపీ సైపుల్లాకు మ‌ధ్య జ‌రిగిన వివాదం అంద‌రికి తెలిసిందే. ఈ ఒక్క‌టే కాకుండా అనంత‌పురం జిల్లా టీడీపీలోనే అనేక వ‌ర్గాల మ‌ధ్య వివాదాలు నెలకొన్న విష‌యం తెలిసిందే. ఈ ఒక్క జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయ‌కుల్లో వ‌ర్గ విభేదాలు కోన‌సాగుతున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. 
 
సొంత‌ పార్టీ నాయ‌కుల్లో జ‌రుగుతున్న కుమ్ములాటే కాకుండా త‌న అభివృద్దికి, త‌న పార్టీ అభివృద్దికి స‌హ‌క‌రించ‌ని అధికారులతో కూడా వివాదాల‌కు పాల్ప‌డుతున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత  దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఎమ్మార్వో వ‌న‌జాక్షి పై దాడి చేసిన విష‌యం అంద‌రికి తెలిసిందే.
 
తాజాగా ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు జిల్లా కలెక్టర్ పై సీరియస్ అయ్యారు. తాను చెప్పిన వారిని కాకుండా జిల్లా లైవ్ స్టాక్ కమిటీని నియమించడంపై ఆయన కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.... అయితే దీనికి కలెక్టర్ తనకు సంబంధం లేకుండానే నియామకాలు జరిగాయని స‌మాధానం ఇచ్చుకున్నారు.... 
 
దీనికి  స్పందించిన మంత్రి అయ్యన్న పాత్రుడు  సాయంత్రంలోగా కమిటీలు మార్చకుంటే రాజీనామా చేస్తానని హెచ్చరించారు.  మంత్రి అయ్యన్న రాజీనామా ప్రకటనతో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సంచలనం రేపింది. ఈ విషయాన్ని జిల్లా ఇన్ ఛార్జి మంత్రి చినరాజప్ప దృష్టికి తీసుకెళ్లారు మంత్రి అయ్య‌న్న పాత్రుడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.