జ‌గ‌న్ దేవినేని ఉమా క‌లిసి వెళ‌తారా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and devineni uma
Updated:  2018-06-30 10:16:40

జ‌గ‌న్ దేవినేని ఉమా క‌లిసి వెళ‌తారా

వైసీపీ నాయ‌కులు అంద‌రూ మంత్రి దేవినేని ఉమాని బాగా లైక్ చేస్తారు.. దానికి ప‌లుకార‌ణాలు ఉన్నాయి.. ఆయ‌న మాట విధానం , పార్టీలో ప‌ద్ద‌తి పై అలాగే ఆయ‌న  వైసీపీ పై  చేసే విమ‌ర్శ‌లు ఏటూ జ‌డ్ అన్ని దేవినేని ఉమాకు మంచి ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టాయి.. ముఖ్యంగా వైసీపీ ట్రోల్ పేజీల్లో దేవినేని ఉమాకు అబిమానులు ఉన్నారు.. అయితే దీనికి కార‌ణం కూడా ఉంది..
 
మంత్రి దేవినేని ఉమా జ‌గ‌న్ కి స‌వాల్ చేస్తే వాటిని వెంట‌నే మ‌ర్చిపోతార‌ట,మిగిలిన నాయ‌కులు అయితే క‌చ్చితంగా స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు గుర్తుచేస్తార‌ట.. నిజ‌మే ఇది వాస్త‌వం అంటున్నారు.. ఎందుకు అంటే గ‌తంలో జ‌గ‌న్ 42 వేల కోట్లు తినేశాడు అని  విమ‌ర్శ‌లు చేసిన తెలుగుదేశం నాయ‌కుల్లో ఈయ‌న కూడా ఉన్నారు.
 
ఇక జ‌గ‌న్ ఎటువంటి ప్లాన్ వేసినా అంతా తూచ్ అంటారు దేవినేని ఉమా..? రాజీనామాలు చేస్తే తూచ్ డ్రామా అన్నారు.. దీక్ష చేస్తే ఉత్తుత్తి దీక్ష అన్నారు..కాని  ఇటు తెలుగుదేశం పార్టీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డంలో ముందు ఉంటుంది అని ఆయ‌న చెప్పే డైలాగులు వింటే, ఆనాడు ఎన్టీఆర్ చెప్పిన పార్టీ మాట‌లు గుర్తువ‌స్తాయి అంటారు  స‌దరు తెలుగుదేశం నాయ‌కులు.
 
అయితే జ‌గ‌న్- మంత్రి దేవినేని ఉమా ఓ విష‌యం పై ఇంకా తేల్చుకోవాలి... జ‌గ‌న్ చూసుకో- రాసి పెట్టుకో 2018 మార్చి నెల‌లో పోల‌వ‌రం పూర్తి అవుతుంది.. కావాలంటే వ‌చ్చి చూసుకో అని దేవినేని ఉమా స‌వాల్  చేశారు... దీనిని  జ‌గ‌న్ మ‌ర్చిపోలేద‌ట... ఇటు మార్చి అయిపోయింది క‌దా మ‌రి జ‌గ‌న్ ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేదు అంటే బ్ర‌హ్మ‌స్త్రం అన్ని స‌మాయాల్లో వ‌ద‌ల‌రు క‌దా అని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.
 
మంత్రి దేవినేని ఉమా అన్నారు కాబ‌ట్టి ఆయ‌న పూర్తి అయిన పోల‌వ‌రం చూపిస్తే క‌చ్చితంగా జ‌గ‌న్ వ‌స్తార‌ని, ఆయ‌న ఎమ్మెల్యేల‌ను  కూడా తీసుకువ‌స్తారు అని అంటున్నారు.. బ‌స్ టికెట్లు వైసీపీ పెట్టుకుంటుంద‌ట.. అలాగే పోల‌వ‌రం బాహుబ‌లి సెట్టింగులు వేసి లేదా అమ‌రావ‌తి  గ్రాఫిక్స్ లా చూపిస్తే మాత్రం జ‌గ‌న్ ఏమ‌న‌క‌పోయినా జ‌నాలు మాత్రం వ‌ద‌ల‌రు అని అంటున్నారు నాయ‌కులు.. శుక్ర‌వారం ఎలాగో పాద‌యాత్ర‌కు జ‌గ‌న్ బ్రేక్ ఇస్తారు కాబట్టి, ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ ని మంత్రిగారు పోల‌వ‌రం తీసుకువెళ్లిచూపిస్తే పాద‌యాత్ర‌కు కూడా బ్రేక్ ఉండ‌ద‌ని అంటున్నారు కొందరు నేత‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.