వైసీపీలో చేర‌డంపై గంటా క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-23 12:43:03

వైసీపీలో చేర‌డంపై గంటా క్లారిటీ

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుతో పాటు ఆయ‌న అనుకూల మీడియా యాజ‌మాన్యం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓ కీల‌క స‌ర్వేను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌ర్వే ప్ర‌కారం వ‌చ్చే ఎన్నికల్లో మ‌రోసారి చంద్ర‌బాబు నాయుడు అధికారంలో కి వ‌స్తార‌ని చెప్పింది. అంతేకాదు అధిక సంఖ్య‌లో ప్ర‌జాధ‌ర‌ణ ఉన్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ కేవ‌లం 60 సీట్ల‌కే ప‌రిమితం అవుతోంద‌ని చెప్పి వైసీపీ అభిమానుల‌ను షాక్ కు గురిచేసిన సంగ‌తి తెలిసిందే.
 
దీంతో పాటు విశాఖ‌లో కీల‌క రాజకీయ నాయ‌కుడిగా ఉన్న టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు నియోజ‌కవ‌ర్గం అయిన భీమిలీ నియోజ‌కవ‌ర్గంలో కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి బీట‌లు వాలే ఆస్కారం ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెప్పి మంత్రిని షాక్ కు గురి చేసింది. దీంతో గంటా నాలుగు రోజుల పాటు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అల‌క చెంది, రీసెంట్ గా రాజ‌ధానిలో ఏర్పాటు చేసిన క్యాబినెట్ స‌మావేశాల‌కు కూడా హాజ‌రు కాలేదు.
 
ఇక రానున్న రోజుల్లో వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే వార్త‌ల‌పై ఎట్ట‌కేల‌కు మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. తాను వైసీపీలో చేరుతానంటూ వ‌స్తున్న వార్త‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌ని స్ప‌ష్టం చేశారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
ఈ కార్య‌క్ర‌మం ముగిసిన తర్వాత మంత్రి గంటా మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ, తాను టీడీపీలో ఉండి రాజ‌కీయంగా ఎంతో ఎదిగాన‌ని, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌పై ఎంతో అభిమానం చూపుతున్నార‌ని అన్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున భీమిలీ నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేస్తానని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు 2014 ఎన్నిక‌ల్లో తాను టీడీపీ త‌ర‌పున పోటీ చేసి 35 వేల మెజారిటీ సాధించాన‌ని అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో 50 మెజారిటీ సాధిస్తాన‌ని గంటా స్ప‌ష్టం చేశారు.  తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తానని మీడియాకు తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.