గంటా పార్టీ మార‌డం ఖాయం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-04 11:47:02

గంటా పార్టీ మార‌డం ఖాయం

ఎప్పుడు అయితే ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు టీడీపీ ప‌ట్టు ఎలా ఉందో తెలుసుకుందామ‌ని త‌న అనుకూల మీడియాతో స‌ర్వే  చేయించారో అప్ప‌టినుంచి టీడీపీ ఎమ్మెల్యేలు అల‌క చెందారు. అందులో ముఖ్యంగా మంత్రి గంటా శ్రీనివాసరావు వ్య‌వ‌హారం పార్టీలో గంద‌ర‌గోళంగా మారుతోంది. విశాఖ‌లో కీల‌క నాయ‌కుడుగా ఉన్న మంత్రి గంటా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట‌మి చెంద‌డం ఖాయం అని తెలిపింది. 
 
దీంతో ఆయ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై అల‌క చెందారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో త‌న ప్ర‌త్య‌ర్థిపై సుమారు 30 వేల పైచిలుకు ఓట్ల‌తో గెలిచిన త‌న‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడిపోతారని ప్ర‌చారం చేయ‌డం ఏంట‌ని మండిప‌డ్డారు. త‌న‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కావాల‌నే ఇలాంటి ప్ర‌చారం చేయిస్తున్నార‌ని గంటా అల‌క చెందిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇదే విషయంపై గంటా త‌న స‌న్నిహితులతో వివ‌రించి బాద‌ప‌డ్డారు. 
 
ఇక త‌న‌పై వ‌చ్చిన వార్త‌ల‌ను జీర్ణించుకోలేక‌ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ద‌మైన‌ ప‌రిస్థితిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జోక్యం చేసుకుని హోంమంత్రి చిన‌రాజ‌ప్ప‌తో బుజ్జ‌గింపు కార్య‌క్రమం చేయించారు. దీంతో గంటా ప‌రిస్థితి స‌ర్థుముఖం ప‌డింద‌ని పార్టీ నాయ‌కులంద‌రూ భావించారు. కానీ గంటా గురించి తాజాగా మ‌రో సంచల‌న వార్త వెలుగులోకి వ‌చ్చింది. త‌న‌ను టీడీపీ నాయ‌కులు ఎంత బుజ్జ‌గించినా కూడా గంటా పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగానే ఉన్నార‌ని తెలుస్తోంది.
 
ఈ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ మార్పుపై తీవ్రంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ విష‌యంపై పార్టీ అధిష్టానం మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. మొద‌ట్లో అధిష్టానం హోంమంత్రిని నామ్ కేవాస్‌ పంపించారు త‌ప్ప త‌న‌ను నిజంగా బుజ్జ‌గించేందుకు పంప‌లేద‌ని గ్ర‌హించార‌ట‌. దీంతో గంటా త‌న‌కు పార్టీలో త‌గిన గుర్తింపు లేద‌నే ఉద్దేశంతో టీడీపీకి గుడ్ బై చెప్పే యోచ‌న‌లో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఆయ‌న ఏ పార్టీలో చేరుతార‌న్న‌ది ప్ర‌శ్న‌. 2019లో కూడా మాజీ మంత్రిగా ఉండాల‌నుకుంటే జ‌న‌సేన పార్టీలో చేరుతార‌ని, ఒకవేళ‌ మంత్రి ప‌ద‌విని ఆశిస్తే వైసీపీ తీర్థం తీసుకుంటార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ విషయంపై జ‌గ‌న్ స్పందించాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.