ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కామెడీకి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తెలుగుదేశం పార్టీ కోవర్టు అని ముద్ర వేసుకున్న కామినేని చేస్తున్న వ్యాఖ్యలు హస్యాస్పదంగా ఉన్నాయి. కామినేని మాటలకు, ప్రస్తుత రాజకీయ పరిస్ధితులకు మధ్య అస్సలు పొంతన కుదరడం లేదండోయ్.
అసలే కేంద్ర ప్రభుత్వంపై ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు యుద్దం ప్రకటించాయి. కాని బీజేపీకి చెందిన కామినేని మాత్రం, తాము వైసీపీతో కలిసి పోటీ చేసే అవకాశం లేదంటూ కమెడీ చేస్తున్నారు. అసలు బీజేపీతో కలిసి పోటీ చేస్తామని ప్రత్యక్షంగా, కనీసం పరోక్షంగానైనా కూడా వైసీపీ ఎక్కడా చెప్పనే లేదు. కేవలం అధికార పార్టీ అనుకూల మీడియా గాలి వార్తలను పరిగణలోకి తీసుకుని కామినేని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగానే విడ్డూరం.
కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతానని ప్రకటించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల వేళ బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తుందని ఎలా అనుకుంటున్నారు.... ఒకవేళ ఎన్నికల తర్వాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, ఇక్కడ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం, మనకు రావాల్సిన వాటి కోసం బీజేపీతో వైసీపీ జత కట్టే అవకాశం ఉంటుందనేది విశ్లేషకుల అంచానా.
ఎన్నికలు ముందు ఎలాంటి పరిస్ధితుల్లోనూ వైసీపీ-బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని, కేవలం ఓట్ల కోసం టీడీపీ-బీజేపీతో పొత్తు కొనసాగిస్తోందని, కాని వైసీపీకి అలాంటి అవసరం లేదని చెబుతున్నారు. మంత్రి కామినేని ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు కామెడీ చేస్తున్నారో అర్ధం కావడం లేదు.
Comments