మంత్రి లోకేష్ మౌనం వెనుక కార‌ణాలెన్నో....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ap it minister nara lokesh image
Updated:  2018-03-12 03:30:24

మంత్రి లోకేష్ మౌనం వెనుక కార‌ణాలెన్నో....

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా, విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలు నేర‌వేర్చాల‌ని రాష్ట్రంలోని., దేశంలోని  ఉన్న అన్ని  రాజ‌కీయ పార్టీలు కేంద్రం పై పోరాటం చేస్తున్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే చివ‌రికి ఇటీవ‌ల ఏపీతో విభ‌జ‌న చెంది కొత్త రాష్ట్రంగా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రం సైతం స్పందించింది..... తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసిఆర్ కుమార్తె ఎంపీ క‌విత ఏకంగా మ‌రో అడుగు ముందుకువేసి పార్ల‌మెంట్ వేదిక‌గా ఏపీకి ప్ర‌త్యేక‌హోదాతో పాటు , విభ‌జ‌న‌చ‌ట్టంలోని అంశాలు నేర‌వేర్చాల‌ని త‌న వాణిని బలంగా వినిపించారు.
 
అయితే టీడీపీ మంత్రి వ‌ర్గంలో కీల‌క నాయ‌కుడిగా  ఉన్న‌ పంచాయతిరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ ప్ర‌త్యేక‌హోదా, విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల పై ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు . రాష్ట్ర‌ అభివృద్ది కోసం బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన ఆయ‌న క‌నీసం రాష్ట్రం న‌ష్ట‌పోతున్న స‌మ‌యంలో కూడా త‌న వాణిని వినిపించ‌క‌పోవ‌డాన్ని మేధావులు త‌ప్పుప‌డుతున్నారు.  ఒక వైపు టీడీపీ నాయ‌కులు, తండ్రి సీఎం చంద్ర‌బాబు కేంద్రం పై పోరాటం చేస్తూ చివ‌రికి కేంద్ర మంత్రుల‌ను రాజీనామా చేయించారు. అయిన‌ప్ప‌టికి మంత్రి లోకేష్ మౌనంగా ఉండ‌డానికి బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.
 
మంత్రి లోకేష్ ప‌ర్య‌వేక్షిస్తున్న పంచాయ‌తిరాజ్‌శాఖ పూర్తిగా కేంద్ర ప్ర‌భుత్వ నిధులతోనే  న‌డుస్తోంది. ఆ నిధుల‌ను రాష్ట్రానికి వినియోగించుకోవ‌డంలో అవినీతి జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ నారా లోకేష్‌ ప్ర‌త్యేక‌హోదా, విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల పై స్పందిస్తే కేంద్రం పంచాయతీ రాజ్‌శాఖకు కేటాయించిన నిధుల పై విచార‌ణ‌కు ఆదేశిస్తే త‌న చిట్టా  బ‌హిష్కృతం అవుతుంద‌ని ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు... రాష్ట్రం అభివృద్ది కాక‌పోయినా, టీడీపీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌క‌పోయినా ప‌ర్వాలేదు గాని ఆయ‌న‌ మాత్రం ప్ర‌ధాని మోదీ పై కేంద్రం పై విమ‌ర్శ‌లు చేయ‌ర‌నే విధంగా ఉన్నార‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.