లోకేష్ ఆ ప‌ని చేస్తే చేతులెత్తేసిన‌ట్టే?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

lokesh tdp
Updated:  2018-03-22 03:30:19

లోకేష్ ఆ ప‌ని చేస్తే చేతులెత్తేసిన‌ట్టే?

జ‌న‌సేన అధినేత‌పై ఎప్పుడూ బాగానే మాట్లాడే తెలుగుదేశం నాయ‌కులు ఇప్పుడు త‌మ పందాని మార్చుకున్నారు... తెలుగుదేశం చేసే విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా వైసీపీ వారిని ప‌వ‌న్ ని ఇప్పుడు తూర్పార‌బెట్ట‌డం జ‌రుగుతోంది సైకిల్ పార్టీ నాయ‌కులు...అయితే ఇప్పుడు ప‌వ‌న్ మ‌న‌వాడు కాదు ప‌గోడు ప‌రాయి వాడు అయిపోయాడు అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి... ముఖ్యంగా ప‌వ‌న్ రాజ‌కీయంగా ఓన‌మాలు దిద్దుకున్నారు తెలుగుదేశం పార్టీలో అని తెలుగుదేశం నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు... ఏది ఏమైనా తెలుగుదేశం  జ‌న‌సేన బంధం ఒక్క‌సారిగా తెగిపోయింది, రాజ‌కీయంగా ఇక బంధం బ‌లంగా ముడివేయ‌లేనిది అని చెప్పాలి.
 
ఇక నారాలోకేష్ అనినీతి అనే మాట మాత్ర‌మే అన్నారు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.... ఆ చిట్టా కూడా విప్పుతారు అనే మాట‌లు ఇటీవ‌ల‌ జ‌న‌సేన నుంచి వినిపిస్తున్నాయి. అయితే ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు తెలుగుదేశంలో పెద్ద క‌ల‌క‌లం రేపాయి.. ఏపీ అంతా మార్మోగిపోయాయి... భావి సీఎం అని అనుకుంటుంటే ఇప్పుడు లోకేష్ రాజ‌కీయానికి  పెద్ద పుల్ స్టాప్ పడుతుందా అనే ఆలోచ‌న‌లు వ‌స్తున్నాయి తెలుగుదేశం నాయ‌కుల‌కు.
 
ఇక తెలుగుదేశం తాజాగా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది అని తెలుస్తోంది.. ఇక ప‌వ‌న్ పాయింట్ కు పుల్ స్టాప్ పెట్టాలి అని ఎలా అనుకున్నా ఇటు వైసీపీ అటు జ‌న‌సేన ఇదే సెంట‌ర్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.. అయితే తెలుగుదేశం ప‌వ‌న్ పై ప‌రువు న‌ష్టం దావావేయ‌డానికి రెడీ అవుతున్నారు అని తెలుస్తోంది... పవన్‌కల్యాణ్‌పై పరువు నష్టం దావా వేసే అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు... ఇక ప‌వ‌న్ స‌ర్టిఫికెట్ అవ‌స‌రం లేదు అని చెప్పిన లోకేష్ మ‌న‌సులో త‌న‌కు తానుగా స‌ర్టిఫికెట్ ఇచ్చుకునే ప‌నిలో ఉంటారా అని కూడా ఆలోచ‌న‌లు వ‌స్తున్నాయి. ఇటు ప‌వ‌న్ ఒక‌వేళ ప‌రువున‌ష్టం దావా వేస్తే వెంట‌నే ప‌వ‌న్ లోకేష్ తెలుగుదేశం నాయ‌కుల అవినీతి చిట్టా విప్పుతారు అని అంటున్నారు సో ఇటు లోకేష్ ఎటువంటి పొలిటిక‌ల్ స్టెప్ వేసినా రాజ‌కీయం డైల‌మాలో ఉంటుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.