ఎల్లయ్యో, మల్లయ్యో... లోకేష్ మాట్లాడాడ‌య్యా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

lokesh image
Updated:  2018-03-05 04:40:56

ఎల్లయ్యో, మల్లయ్యో... లోకేష్ మాట్లాడాడ‌య్యా

తెలుగుదేశం యువ‌తేజం మంత్రి లోకేశ్ బాబు ఇటీవ‌ల ప‌ర్య‌ట‌న‌లు అమ‌రావ‌తికి ల‌చ్చ‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల వేట‌లో బిజీగా ఉంటున్నారు.. అమెరికా నుంచి గూగుల్ ఇటు దావోస్ నుంచి ప‌లు కంపెనీల ను అమ‌రావ‌తికి  పెట్టుబ‌డులు తీసుకురావ‌డానికి బాగా బిజీగా ఉంటున్నారు లోకేశ్... అయితే తాజాగా ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గుతున్న సంద‌ర్బంగా మంత్రి లోకేశ్ మీడియాతో చిట్ చాట్ చేశారు.. ఈ స‌మ‌యంలో ప‌లు విష‌యాల‌ను ఆయ‌న చ‌ర్చించారు.

ఎల్లయ్యో, మల్లయ్యో అడిగితే చెప్పాలా? ఏపీకి ప్ర‌త్యేక హూదా కావాలి అనేది అంద‌రికి తెలిసిందే... మ‌న‌కు రాష్ట్రం విడిపోయిన స‌మ‌యంలో విభ‌జ‌న చ‌ట్టంలో ఎటువంటి హామీలు అయితే ఇచ్చారో అవ‌న్ని నెర‌వేర్చాలి అని ఆయ‌న కోరారు.. మొత్తానికి కేంద్రం ఏపికి ఎటువంటి నిధులు ఇస్తాము అన్నారో, ఆ నిధులు విభ‌జ‌న హామీల గురించి చ‌ర్చిస్తామ‌ని ఆయ‌న తెలియ‌చేశారు.. 

రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చింది?  ఏమీ ఇవ్వాలి?  అనేది అసెంబ్లీ వేదిక‌గా క‌చ్చితంగా ప్ర‌జ‌ల‌కు  తెలియ‌చేస్తాం అని అన్నారు మంత్రి లోకేశ్ ...రాయలసీమ వెనుకబాటుతనం, జరిగిన అన్యాయంపై బీజేపీ నేతలు చేసిన !! కర్నూలు డిక్లరేషన్ !! ను చూసి తాను ఆశ్చర్యపోయానని మంత్రి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ పాలనలో రాయలసీమ అభివృద్ధి చెందింది. అలా కాదంటూ ఎవరో ఎల్లయ్యో, మల్లయ్యో రాయలసీమ డిక్లరేషన్‌ పెడితే దాని గురించి నేను మాట్లాడాలా? అని మంత్రి లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

ఇక దేశంలో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేలా అమ‌రావ‌తి నిర్మిస్తాం అన్నారు.. అలాగే భార‌త‌దేశానికి ద‌క్షిణాదిలో రెండో రాజ‌ధానిగా క‌ర్నూలును చేస్తే బాగుంటుంది అని అన్నారు ఆయ‌న...  ఇక తెలంగాణ‌లో టీఆర్ ఎస్ పార్టీతో పొత్తు ఉంటుంది అని ఎక్క‌డా చంద్రబాబు చెప్ప‌లేదు అని అన్నారు మంత్రి లోకేశ్.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.