సుజ‌నా రాజీనామా నారాయ‌ణ క్లారిటీ..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-09 03:06:28

సుజ‌నా రాజీనామా నారాయ‌ణ క్లారిటీ..?

కేంద్రం పై పోరాటం, ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ ప్ల‌కార్డులు ప‌ట్టుకుని ఏపీకి న్యాయం చేయాలి అని పార్ల‌మెంట్లో కోరుతున్నారు ఏపీ ఎంపీలు... అయితే విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీకి  చేయ‌వ‌ల‌సిన న్యాయాలు అన్ని చేస్తాం అంటోంది  కేంద్రం... ఏది ఏమైనా కేంద్రం పై పోరాడాలి ఏపీకి న్యాయం జ‌రిగేలా చూడాలి ఇది సీఎం చంద్రబాబు ఆర్డ‌ర్...ఓ ప‌క్క గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా తేల్చుకోమ‌ని స‌వాల్ గా తెలిపారు కేంద్రానికి. 
 
ఇక కేంద్రం ఏపీపై చూపుతున్న నిర్ల‌క్ష్య దోర‌ణి పై కేంద్రంతో తెలుగుదేశం క‌టీఫ్ చెప్ప‌డానికి రెడీ అవుతుంది అని వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి.. ఇక కేంద్రంతో మ‌నం బ‌య‌ట‌కు రావాలి అని ఏపీ మంత్రులు కూడా చెబుతున్నారు. అని తెలుస్తోంది. ఇదే వార్త‌లు తెలుగుదేశం కాంపౌండ్ నుంచి వినిపిస్తున్నాయి.
 
తాజాగా తెలుగుదేశం అధినేత‌కు ఏపీ మంత్రులు క్లారిటీ ఇస్తున్నార‌ట‌...తాజాగా ఏపీ మంత్రి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తే కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చేసిన కామెంట్స్ సుజనా చౌదరి ని ఇరుకున్న పెట్టినట్లు ఉన్నాయి అని అంటున్నారు నాయ‌కులు... అయితే మంత్రి నారాయ‌ణ ఇటువంటి కామెంట్లు చేయ‌డం ఏమిట‌ని ఆలోచిస్తున్నారు నాయ‌కులు..
 
కేంద్రంలో తెలుగుదేశం మంత్రులు ఇద్ద‌రు కొన‌సాగుతున్నారు.. అశోక్ గ‌జ‌ప‌తిరాజు అలాగే సుజ‌నా చౌద‌రి.. వారు కేబినెట్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే కేంద్రం పై మ‌రింత ఒత్తిడి పెరుగుతుంది అని భావిస్తున్నారు నాయ‌కులు. అయితే పార్టీలో సుజ‌నాకు వ్యతిరేక వ‌ర్గం ఉంది.. వీరు అంద‌రూ క‌లిసి సుజ‌నాను టార్గెట్  చేసార‌ని అంటున్నారు. అందుకే సుజ‌నా రాజీనామా చేయ‌డానికి సిద్దంగా ఉన్నారు అని అంటున్నారు అని పొలిటిక‌ల్ కారిడార్లో చ‌ర్చించుకుంటున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.