మంత్రి పైడి కొండల సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-26 10:43:25

మంత్రి పైడి కొండల సంచ‌ల‌న నిర్ణ‌యం

ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండ‌ల మాణిక్యాల‌రావు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తిరుమ‌ల తిరుప‌తి దేవాస్ధానానికి సంబంధించి రానున్న రోజుల్లో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చే వారిలో రోజుకు స‌మారు 30 వేల మంది భ‌క్తులు ద‌ర్శ‌నం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నార‌ని ఆయ‌న అన్నారు. ఈ క్ర‌మంలో తిరుమల దైవ దర్శనానికి కోటా విధానం అమ‌లు చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెప్పారు.

ఏడాదిలో కేవ‌లం రెండుసార్లు మాత్ర‌మే శ్రీవారిని ద‌ర్శించుకునేలా నియంత్ర‌ణ విధించే యోచ‌న‌లో ఉన్నామ‌ని మాణిక్యాల‌రావు వెల్ల‌డించారు. దీంతో మంత్రి వ్యాఖ్య‌ల‌పై కొంద‌రు సానుకూలంగా స్పందించ‌గా..... మ‌రికొంద‌రు విభేదిస్తున్నారు.

ఓ ర‌కంగా చెప్పాలంటే శ్రీవారిని ఎక్కువ సార్లు ద‌ర్శించుకునే వారిలో రాజ‌కీయ నాయ‌కులు, సినీ న‌టులు, పారిశ్రామిక‌వేత్త‌లు ఉన్నారు. వీరు వీఐపీ-వీవీఐపీ కోటాలో ద‌ర్జాగా ఏ ఆటంకం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు.

సామాన్య ప్ర‌జ‌లు మాత్రం శ్రీవారి ద‌ర్శ‌నం కోసం అనేక ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. దీంతో ఆధార్ తో అనుసంధానం చేసి ఏటా రెండు సార్లు మాత్ర‌మే...అది కూడా కేటాయించిన స‌మ‌యంలోనే వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా ఆలోచిస్లున్న‌ట్లు తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.