మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

somi reddy controversy comments
Updated:  2018-05-26 06:23:27

మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ర‌మ‌ణ‌ దీక్షితుల‌పై కొద్ది కాలంగా తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న ఆరోప‌ణ‌లు మ‌నంద‌రికీ తెలిసిందే. ఇక తాజాగా మ‌రో సారి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి ఏక వ‌చ‌నంతో దూషిస్తూ ర‌మ‌ణ దీక్షితుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ చంద్ర‌బాబు గురించి వారికి ఏం తెలుస‌ని, ఎవరీ రమణ దీక్షితులు వారిని బొక్కలోకి తోసి.. నాలుగు తంతే నిజాలు బయటకు వస్తాయంటూ బెదిరింపులకు దిగారు. 
 
అలాగే తమ‌కు టీటీడీలో ఏం జ‌రుగుతున్నాయే అన్ని తెలుసని సోమిరెడ్డి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడారు. ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర స్థాయిలో త‌ప్పుబ‌డుతున్నారు అర్చ‌కులు. దేవునికి పూజ‌లు చేసే అర్చ‌కులను దేవుడితో స‌మానంగా పూజించే సంప్ర‌దాయం మ‌న దేశ ఆచారం అని అంత‌టి వ్య‌క్తుల‌ను టీడీపీ నాయ‌కులు, మంత్రులు బొక్కలోకి తోసి.. నాలుగు తన్నాల‌ని విచ‌క్ష‌ణా ర‌హితంగా మాట్లాడ‌టం ఏంట‌ని బ్రాహ్మ‌ణ సంఘాలు మండిప‌డుతున్నాయి.
 
ఇక ఇదే విష‌యంపై వైసీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు స్పందించారు. ప‌విత్ర‌మైన పుణ్య‌క్షేత్రంలో అర్చ‌కులు న‌ల్ల బార్చీలు ధ‌రించుకుని నిర‌స‌న‌లు తెలిపేంత దిగ‌జారుడుకు టీడీపీ నాయ‌క‌లు రాజ‌కీయం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అలాగే టీటీడీ వ్య‌వ‌హారంలో బీజేపీ, వైసీపీ నాయ‌కులు క‌లిసి కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అంటున్నార‌ని, అయితే త‌మ‌కు వారికి ఎలాంటి సంబంధం లేద‌ని ఇదే విష‌యాన్ని మంత్రి సోమిరెడ్డి గ‌మ‌నించాల‌ని అంబటి తెలిపారు. 
 
సాక్షాత్తు ర‌మ‌ణ దీక్షితుల‌నే బొక్క‌లో తోసి తన్నించేంత దిగ‌జారుడు స్థాయికి టీడీపీ చేరింద‌ని ఆయ‌న మండిపడ్డారు. ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో ఎవ‌రైనా టీడీపీకి వ్య‌తిరేకంగా మాట్లాడితే వారిపై అక్రమంగా కేసులు పెట్టార‌ని, అలాగే ఇప్పుడు ర‌మ‌ణ దీక్షితులు స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా మాట్లాడితే వారిని బొక్క‌లో వేసి తన్నించాల‌ని చూస్తారా..అని అంబ‌టి ప్ర‌శ్నించారు. అయ్యా! మంత్రి సోమిరెడ్డిగారు మంత్రిద‌విని చేస్తున్నారా లేక మీరు ప‌శువుల‌ను కాస్తున్నారా అని విమ‌ర్శించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.