మా పోరాటం ఆగ‌దు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-11 17:52:14

మా పోరాటం ఆగ‌దు

ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏపీకి ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టిన సంగతి తెలిసిందే..వైసీపీ ఎంపీలు చేప‌ట్టిన ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష నేటితో ఆరవ రోజుకు చేరుకోవ‌డంతో మిథున్ రెడ్డికి అవినాష్ రెడ్డి చికిత్స నిర్వ‌హించిన డాక్ట‌ర్లు వీరిని వెంటనే ఆసుప‌త్రికి త‌ర‌లించాల‌ని లేక‌పోతే ఈ రోజు సాయంత్రం లోపు షుగ‌ర్ లెవిల్ పూర్తిగా త‌గ్గిపోతాయ‌ని సూచించారు.
 
దీంతో పోలీసులు సుమారు వంద‌మందికి పైగా దీక్ష శిభిరానికి చేరుకుని వారిని బ‌ల‌వంతంగా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.... ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న వైసీపీ కార్య‌క‌ర్తలు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, జై జగన్‌, జై వైఎస్సార్‌సీపీ అని కార్యకర్తలు నినాదాలు చేశారు.. 
 
త‌మ రాష్ట్రానికి కేంద్రం ప్ర‌త్యే హోదా ప్ర‌క‌టించ‌కుండా మోసం చేస్తోందని ఆరోపించారు.. వైసీపీ ఎంపీలను  పోలీసులు బ‌ల‌వంతంగా  రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రికి త‌ర‌లించారు.. అయినా అక్క‌డ వైద్యం చేయించుకునేందుకు నిరాకరిస్తున్నారు ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి... ఇక  ఎంపీలకు ఫ్లూయిడ్స్‌ ఎక్కించేందుకు వైద్యులు ప్రయత్నించినా.. అందుకు వారు నిరాకరించారు. దీక్ష కొనసాగించాలన్న సంకల్పాన్ని ప్రదర్శించారు. దీంతో అక్క‌డ కూడా ఉద్రిక్త‌త కొన‌సాగుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.