ద‌మ్ముంటే నా ద‌గ్గ‌రకు రండి ...మిథున్ రెడ్డి స‌వాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

mithun reddy
Updated:  2018-10-30 03:33:18

ద‌మ్ముంటే నా ద‌గ్గ‌రకు రండి ...మిథున్ రెడ్డి స‌వాల్

విశాఖ ఎయిర్ పోర్టులో ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై శ్రీనివాస‌రావు అనే వ్య‌క్తి కోడి పందాల‌కు వాడే క‌త్తితో హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ హ‌త్యాయ‌త్నం లో గాయ‌ప‌డిన జ‌గ‌న్ హైద‌రాబాద్ లోని సిటీ న్యూరో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని లోట‌స్ పాండ్ లోని త‌న నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. 
 
తాజాగా జ‌గ‌న్ గాయాన్ని ప‌రిశీలించేందుకు వ‌చ్చిన న‌లుగురు ఆసుప‌త్రి వైద్యులు ఆయ‌నకు వైద్య ప‌రీక్ష‌లు చేసి ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకున్నారు. పరీక్ష‌ల త‌ర్వాత‌ క‌త్తికి ఎలాంటి విష‌పూరిత‌మైన ప‌దార్థాలు పూయ‌లేద‌ని వైద్యులు మీడియాకు తెలిపారు. అలాగే జ‌గ‌న్ కు త‌గిలిన గాయం మానేందుకు సుమారు నెల‌న్న‌ర‌ప‌డుతుంద‌ని వైద్యులు తేల్చి చెప్పారు. 
 
నవంబ‌ర్ మూడ‌వ‌తేదిన జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సిద్ద‌మ‌వుతున్న‌ప్ప‌టికి వైద్యులు మ‌రికొద్ది రోజులు ఆయ‌న రెస్ట్ తీసుకోవాల‌ని అంటున్నారు.  కానీ పాద‌యాత్ర చేసేందుకు మొగ్గు చూపుతున్నారు జ‌గ‌న్. మ‌రో వైపు మాజీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కోడిక‌త్తి మెడ‌లో దిగితే ఏం కాద‌నే వారంత ద‌మ్ముంటే త‌న ద‌గ్గ‌ర‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు.
 
అలాంటి వారికి ఏం జ‌రుగుతుందో తాను చూపిస్తాన‌న్నారు. ఈ క్ర‌మంలో త‌న‌పై కేసులు న‌మోదు అయినా ప‌ర్యాలేద‌ని మిథున్ రెడ్డి అన్నారు. జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నాన్ని రాజ‌కీయం చేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులకు సిగ్గులేద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. త‌ల్లి చెల్లిని రాజ‌కీయాల్లోకి లాగ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.  

షేర్ :

Comments

0 Comment