మిథున్ రెడ్డి సవాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-21 15:51:50

మిథున్ రెడ్డి సవాల్

కడప జయరాజ్ గార్డెన్ లో రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గ స్థాయి బూత్ కన్వీనర్స్ సమావేశంలో ఆదినారాయణ రెడ్డిపై రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు.ఆదినారాయణ రెడ్డికి ప్రజలే సరైన విధంగా బుద్ధి చెబుతారు...ఆదినారాయణ రెడ్డికి జగన్ పైన, జగన్ కుటుంబంపైన మాట్లాడే అర్హతలేదని మండిపడ్డారు.
 
డబ్బుల కోసం ఆశపడి ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించి మంత్రి పదవి తీసుకోవడం కాదు.. దమ్ముంటే రాజీనామా చేసి, గెలిచి వేరేపార్టీలోకి వెళ్లాలని సవాల్ చేశారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి...మళ్లీ ఎన్నికలకి వెళ్తే ఆదినారాయణ రెడ్డికి డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు ఆయన...
 
ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ...పార్టీ ని బూత్ స్థాయిలో బలోపేతం చేయడానికి మీరు అంత కలిసి మెలిసి పని చేయాలి.. మన పార్టీ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలపై పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి  అలుపు ఎరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు..
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు..ఇది ఎన్నికల సమయం కాబట్టి బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త కష్ట‌పడి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు...జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అన్ని రకాల వర్గాల వారికి మేలు జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.