చంద్ర‌బాబులో వ‌ణుకు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-22 17:21:00

చంద్ర‌బాబులో వ‌ణుకు

నాలుగు సంవ‌త్స‌రాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక హోదా సాధ‌న‌ కోసం చిత్త‌శుద్దితో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భూత్వాల‌తో పోరాడుతూనే ఉన్నార‌ని రాజీనామా చేసిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. తాము కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే త‌మ ప‌ద‌వ‌ల‌కు రాజీనామా చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ రాజీనామాల‌ను స్పీక‌ర్ సుమిత్ర మ‌హ‌జ‌న్ ఆమోదించ‌డంలో ఆల‌స్యం చేశారంటే కేంద్రం ఎంత బ‌య‌ప‌డుతుందో అర్థం అవుమ‌వుతోంద‌ని మిథున్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.
 
ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, పార్ల‌మెంట్ చివ‌రి స‌మావేశాలు జ‌రిగేట‌ప్పుడు తాము రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రానికి వ్య‌తిరేకంగా అవిశ్వాస తీర్మ‌నం పెడుతున్నామని, త‌మ‌కు టీడీపీ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని అడిగామ‌ని మిథున్ రెడ్డి గుర్తు చేశారు. అయితే మొద‌ట్లో టీడీపీ నాయ‌కులు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చెప్పి చివ‌రి క్ష‌ణంలో మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని చెప్పార‌ని ఆయ‌న విమ‌ర్శించారు
 
ఆ రోజు టీడీపీ నాయ‌కులు త‌మ‌కు మ‌ద్ద‌తు ఇచ్చి ఉంటే రాష్ట్రానికి ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని, మూకుమ్మ‌డిగా 25 మంది పార్ల‌మెంట్ స‌భ్య‌లు రాజీనామా చేస్తే దేశం మొత్తం చ‌ర్చ జ‌రుగుతుంద‌ని తెలిసి కూడా చంద్ర‌బాబు నాయుడు త‌మ‌కు మద్ద‌తు ఇవ్వ‌లేద‌ని మిథున్ రెడ్డి మండిప‌డ్డారు. పైగా తాము కేంద్రంపై అవిశ్వాసం పెడితే ఐదు మందితో ఏం అవిశ్వాసం పెడ‌తార‌ని టీడీపీ నాయ‌కులు న‌వ్వార‌ని గుర్తుచేశారు. 
 
అయితే తాము టీడీపీ నాయ‌కులు చేసిని కామెంట్స్ ను ప‌ట్టించుకోకుండా, వాళ్ల స‌ర్టిఫికెట్ మాకు అవ‌స‌రం లేద‌ని భావించి ధృడ‌మైన సంక‌ల్పంతో ముందుకు వెళ్లామ‌ని మిథున్ రెడ్డి అన్నారు. అలాగే గ‌తంలో అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి వైసీపీ కి చెందిన ఇద్ద‌రు ఎంపీల‌పై ఫిర్యాదు చేసి మూడేళ్లు అయినా ఇంత‌వ‌ర‌కు వారిపై చర్యలు తీసుకోలేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 
 
ఇక ఇప్పుడు త‌మ రాజీనామాల‌ను స్పీక‌ర్ ఆమోదించ‌డంతో చంద్ర‌బాబు నాయుడుకి కంటిమీద కునుకు లేకుండాపోయింద‌ని మిథున్ రెడ్డి తెలిపారు. త‌మ‌ పదవులు పోయినా ప్రత్యేక హోదా సాధన దిశగా త‌మ‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతామని మిథున్‌ రెడ్డి తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.