APMDC జరుగుతున్న అవినీతిని బయటపెడతా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-21 18:31:01

APMDC జరుగుతున్న అవినీతిని బయటపెడతా

APMDC అవకతవకలపై ప్రశ్నించిన సంక్షేమ సాధన సమితి సభ్యులపై కేసులు పెట్టి, రోజు ఇద్దరికీ నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వేధిస్తున్నారని, బాధితులపై పోరాడుతున్న మాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారని, మాకు అండగా నిలవాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కలిసి తమ బాధలను చెప్పుకున్నారు సంక్షేమ సాధన సమితి  సభ్యులు.
 
ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు కావాలనే అవినీతిపైనా ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులను బనాయించి భయపెట్టాలని చూస్తున్నారని, దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదని పార్టీ సపోర్ట్, నాయకుల సపోర్ట్ ఎల్లవేళలా మీకు ఉంటుందని వాళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇచ్చారు ఆయన...ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అయితే APMDC లో మీరు చేసిన అవినీతిపై నేను ప్రశ్నిస్తున్న, నాపైన కేసులు పెట్టండి అన్నారు మిథున్ రెడ్డి.
 
APMDCలో జరుగుతున్న అవకతవకలపై, సంక్షేమ సాధన సమితి సభ్యులపై కేసులపై పెట్టిన కేసులపై పోరాడడానికి తాను సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు... త్వరలో మిల్లు యజమానులతో కూడా సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు ఆయన...
 
APMDC జరుగుతున్న అవకతవకలను, వాళ్ళ సమస్యలను పాదయాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందు సంక్షేమ సాధన సమితి సభ్యులను జగన్ మోహన్ రెడ్డితో కలిసే ఏర్పాట్లు చేయనున్నారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి...ఈ సమస్యపై రాష్ట్రా వ్యాప్తంగా చర్చ జరిగేలా చేసి, APMDC లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. APMDC జరుగుతున్న అన్ని విషయాలను బయటపెడతామని చెప్పారు ఎంపీ మిథున్ రెడ్డి.
 
మీకు ఎలాంటి సమస్య వచ్చిన తెలియజేయాలని, ప్రజల సమస్యలను తీర్చడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి...మాకు ఎప్పుడు సమస్య వచ్చిన, ఆ సమస్యపైన మిథున్ రెడ్డి ముందుండి పోరాడుతారని,  ఇలాంటి వ్యక్తి మాకు ఎంపీగా ఉండడం వల్లే, టీడీపీ నాయకులు భయపెడుతున్నమేము బయట తిరగగలుగుతున్నామని అన్నారు సంక్షేమ సాధన సమితి సభ్యులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.