జ‌గ‌న్ కోసం వారంద‌రూ రెడీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-30 16:07:28

జ‌గ‌న్ కోసం వారంద‌రూ రెడీ

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్  వంచ‌న వ్య‌తిరేక దీక్ష బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ... ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నార‌ని గుర్తు చేశారు... అయితే ఈ పోరాటాన్ని చూసి ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుకు వెన్నులో వ‌ణుకు పుడుతోంద‌ని అనికుమార్ యాద‌వ్ అన్నారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఆరు వంద‌ల‌కు పైగా త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారాన్ని ద‌క్కించుకున్నార‌ని, కానీ ఆ త‌ప్పుడు హామీల్లో ఏ ఒక్క‌టి కూడా అమ‌లు చేయ‌లేద‌ని గుర్తు చేశారు..ఇక గ‌తంలో చంద్ర‌బాబు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం ఉండ‌కూడ‌దు... ఉండ‌కూడ‌దూ అని అంటూ ఉండేవార‌ని, అయితే ఆయ‌న మాటే నిజం అవుతోంద‌ని, రానున్న రోజుల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌తిప‌క్షం లేకుండా చేస్తామ‌ని అన్నారు... వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక చంద్ర‌బాబుకు ఆయ‌న కుమారుడికి రెండు సీట్లు ఇస్తామ‌ని అసెంబ్లీలో మీ ఇద్ద‌రితో బంతి ఆడుకోవాలి గా,  క‌చ్చితంగా మీ ఇద్ద‌రికి సీట్లు ఇస్తామ‌ని అనిల్ అన్నారు.
 
చంద్ర‌బాబు లాగా  ముందొక మాట వేనుకొక మాట మాట్లాడ‌మ‌ని..? తాము రాష్ట్రానికి అమ‌ర సంజీవ‌ని అయిన ప్ర‌త్యేక హోదా కోసం ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా పోరాడుతామ‌ని అన్నారు..అలాగే మా నాయ‌కుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని ఈ దేశంలో ఎక్క‌డ అయినా స‌గ‌ర్వంగా చెబుతామ‌ని, అదే  టీడీపీ నాయ‌కులు త‌మ నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడ‌ని ఒక్క‌రైనా స‌గ‌ర్వంగా చెప్పుకుంటారా అని అనిల్ కుమార్ యాద‌వ్ ప్ర‌శ్నించారు.. రాష్ట్రంలో చంద్ర‌బాబు కోసం ప్రాణాల‌ను అర్పించేందుకు ఎవ‌రైనా ఉన్నారో లేదొ కానీ, జ‌గ‌న్ కోసం ఈ రాష్ట్రంలో ప్రాణాల‌ను అర్పించేంకు లక్షలాది మంది సైనికులు సిద్దంగా ఉన్నార‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.