చంద్ర‌బాబును వ‌ణికిస్తున్న అంశం ఇదే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

anil kumar yadav image
Updated:  2018-03-13 05:36:36

చంద్ర‌బాబును వ‌ణికిస్తున్న అంశం ఇదే

నెల్లూరు జిల్లాలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనికి కార‌ణం వైసీపీగుర్తుతో  గెలిచిన 22 మంది ఎమ్మెల్యేల‌ను  రాజ్యాంగానికి  విరుద్దంగా  పార్టీలోకి తీసుకుని, వారికి ఏకంగా మంత్రి ప‌ద‌వులు సైతం క‌ట్ట‌బెట్టి ఘ‌నంగా స‌న్మానించింది తెలుగుదేశం స‌ర్కార్‌.  అన్నా వెంకట రాంబాబు పిటిష‌న్ తో ఫిరాయింపు ఎమ్మెల్యేల పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వానికి ఉత్త‌ర్వులు జారి చేసింది హైకోర్టు... అదే విధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు కూడా పంపించింది.
 
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి అనుభ‌వం లేకపోయినా నీతికి నిజాయితీకి నిలువుట‌ద్దంగా ప్ర‌జ‌ల కోసం పోరాడుతున్నామ‌ని అన్నారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ .గతంలో  పార్టీల‌ను ఫిరాయించి వైయస్‌ఆర్‌ సీపీలోకి వ‌చ్చిన‌  వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లిన‌ట్లు గుర్తు చేశారు. తెలంగాణలో టీడీపీకి సంబందించిన‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరితే కేసీఆర్‌ వ్యభిచారం చేయిస్తున్నాడని చంద్రబాబు అన్నారు. ఏపీలో బాబు కూడా అదే ప‌ని చేయ‌డం విడ్డూరంగా ఉంది అని అన్నారు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌.
 
వైయ‌స్ జ‌గ‌న్‌కు పుట్టుక‌తోనే నీతి, నిజాయతీ  ధైర్యం ఉంటే చంద్ర‌బాబుకు వెన్నుపోటు పోడ‌వ‌డం, అబ‌ద్ద‌పు హామీలు ఇవ్వ‌డం, ఎదుగుతున్న వాళ్ల‌ను తోక్క‌డం లాంటి నీచ‌మైన అల‌వాట్లు ఉన్నాయ‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న్‌ ఏ విష‌యాన్ని అయినా  ప్ర‌జాక్షేత్రంలో తేల్చుకుంటార‌ని తెలిపారు. ఫిరాయింపు నాయ‌కుల‌తో రాజీనామా చేయిస్తే మా నాయ‌కుడు ఆదేశాలు మేర‌కు అసెంబ్లీకు రావ‌డానికి మేము సిద్దం అని అన్నారు....వైయ‌స్ జ‌గ‌న్ శాస‌న‌స‌భ‌కు వ‌స్తే చంద్ర‌బాబు గుండెల్లో గుబులు పుడుతుంద‌ని ఎద్దెవా చేశారు ఆయ‌న‌.   
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.