ఎమ్మెల్యే చింతమనేనికి ఆరు నెలల జైలు శిక్ష

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-14 01:23:45

ఎమ్మెల్యే చింతమనేనికి ఆరు నెలల జైలు శిక్ష

వివాదాల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో ఉండి, ఏపీ అంతా తెలుగుదేశంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్ధానం క‌ల్పించుకున్నారు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా, దెందులూరు తెలుగుదేశం ఎమ్మెల్యే  చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ చౌద‌రి.. ఇక ఎమ్మార్వో వ‌న‌జాక్షి వివాదం నుంచి ఈయ‌న పై ఏదో వార్త హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉంది.. మంత్రి ప‌ద‌వి రాలేద‌ని ఏకంగా పార్టీ నుంచి, అలాగే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డానికి సిద్ద‌మ‌య్యారు.
 
అలాగే ఆయ‌న కొత్త పార్టీ పెట్ట‌నున్నారు అని వార్త‌లు వినిపించాయి ఆ స‌మ‌యంలో.. అయితే ఇప్పుడు ఈ మాట‌లు కాదు ఏకంగా కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది ఓ కేసులో....ఎమ్మెల్యే చింత‌మ‌నేనికి భీమ‌డోలు మెజిస్ట్రేట్ కోర్టు షాక్‌ ఇచ్చింది. మాజీ మంత్రిపై చేయి చేసుకున్న కేసులో న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది.
 
వివరాల్లోకి వెళ్తే 2011లో అప్పటి కాంగ్రెస్ మంత్రి జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు వట్టి వసంత్‌కుమార్‌పై చింతమనేని ప్రభాకర్‌ చేయి చేసుకున్నారు. అదే సమయంలో ఎంపీ కావూరి సాంబశివరావుపైనా  దౌర్జన్యం చేశారు..దీనిపై అప్ప‌ట్లోఈ సంఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.
 
అయితే ఈ వ్యవహారంపై వట్టి వసంత్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ జరిపిన భీమడోలు మెజిస్ట్రేట్‌ కోర్టు చింతమనేనికి ఆరు నెలల జైలు శిక్ష, తో పాటు రూ.5వేలు జరిమాన విధించింది... ఏ దూకుడు అయితే ఆయ‌కు ఉందో అదే దూకుడు ఆయ‌న‌కు మ‌రింత నెగిటీవ్ ఫేమ్ తీసుకువ‌స్తోంది అని జిల్లా నాయ‌కులు కూడా అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.