ఇక్క‌డ ప‌నేంటి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-07 16:25:27

ఇక్క‌డ ప‌నేంటి

2014 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి అత్య‌ధిక మెజారిటీతో గెలిచిన నాయ‌కులు... అధికార తెలుగుదేశం పార్టీ ప్రలోభాల‌కు లొంగిపోయి గ‌తంలో వైసీపీ వీడి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ కండువా కప్పుకున్న సంగ‌తి తెలిసిందే... దీంతో పాటు రాజ్యాంగానికి విరుద్దంగా టీడీపీ వారికి మంత్రి ప‌ద‌వుల‌ను కూడా కేటాయించింది... ఈ  ప‌ద‌వుల‌తో ఫిరాయింపు ఎమ్యెల్యేలు టీడీపీలో రెండు సంవ‌త్స‌రాల పాటు సాఫిగా న‌డుస్తున్నారు.
 
ఆ త‌ర్వాత మెల్ల‌మెల్ల‌గా టీడీపీలో ఈ అంత‌ర్యుద్దం  మొద‌లైంది...ముఖ్యంగా రాయ‌ల‌సీమ ఫిరాయింపు ఎమ్యెల్యేల‌లో  అంత‌ర్యుద్దం అధిక‌మ‌వుతోంది... సెగ్మెంట్ వారిగా ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రు బైక్ యాత్ర‌, సైకిల్ యాత్రల‌ను  ఫిరాయింపు ఎమ్యెల్యేలు చేప‌డుతున్నారు... ఇక ఇప్ప‌టికే ఆళ్ల‌గ‌డ్డ‌లో టీడీపీ నేత ఏ.వీ సుబ్బారెడ్డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కోరిక మేర‌కు సైకిల్ యాత్ర‌ను చేప‌ట్టారు... ఈ యాత్ర‌లో ఆయ‌న‌కు గిట్ట‌ని వారు ఏవీ పై రాళ్ల‌తో దాడి చేశారు... అయితే త‌న‌పై రాళ్ల‌తో దాడి చేయించింది మంత్రి అఖిల ప్రియనే అని సుబ్బారెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు... ఈ వ్య‌వ‌హారం కాస్త చంద్ర‌బాబు దృష్టికి చేర‌డంతో వీరిద్ద‌రిని అమ‌రావ‌తికి పిలిపించి గ‌ట్టిగా క్లాస్ తీసుకున్నారు ఆయ‌న‌.
 
ఇక ఈ గొడ‌వ ముగిసిన కొద్ది రోజుల‌కే క‌డ‌ప జిల్లా ఫిరాయింపుల వ్య‌వ‌హారం తెర‌పైకి వ‌చ్చింది... నిన్న మంత్రి ఆదినారాయ‌ణ‌ రెడ్డి బ‌ద్వేలు నియోజకవ‌ర్గ ప‌రిధిలోని పోరుమామిళ్ల‌లో బైక్ ర్యాలీని చేప‌ట్టారు... అయితే ఈ బైక్ ర్యాలీపై ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌య‌రాములు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు... త‌న‌కు తెలియ‌కుండా ఆదినారాయణ రెడ్డి ఎందుకు బైక్ ర్యాలీ నిర్వ‌హించార‌ని త‌ప్పుబ‌ట్టారు... అయితే ఇదే ర్యాలీని ఆయన నియోజకవర్గంలో ఆదికి  చెప్పకుండా తాను వెళ్లి ర్యాలీలు నిర్వహిస్తే ఊరుకుంటారా..? అని ప్రశ్నించారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... తామిద్ద‌రం జంప్ జిలానీల‌మేన‌ని, వైసీపీలో గెలిచి టీడీపీలోకి వ‌చ్చామ‌ని జ‌య‌రాములు గుర్తుచేశారు... అయితే ఆయ‌న‌కు అదృష్టం బాగుండి మంత్రి ప‌ద‌వి ద‌క్కింద‌ని,త‌న‌కు ద‌క్క‌లేద‌ని అన్నారు...అలాగే ఆది నారాయ‌ణ రెడ్డికి త‌న‌కు చాలా వ్య‌త్యాసం ఉంద‌ని అన్నారు.... ఆయ‌న‌ కేవ‌లం డ‌బ్బు సంపాదించుకోవ‌డానికి రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని, తాను మాత్రం ప్ర‌జా సేవ చేసేందుకు వ‌చ్చాన‌ని జ‌య‌రాములు అన్నారు.
 
అలాగే గ‌తంలో తాను ఇన్ చార్జ్ విజయమ్మ తో నియోజ‌కవ‌ర్గం అభివృద్ది కోసం క‌లిసి ప‌నిచేద్దామ‌ని చెప్పినా వినడం లేదని మండిప‌డ్డారు..దీంతో పాటు బద్వేలులో అందరం  కలసి ఒకేచోట దీక్ష చేద్దామంటే వినకుండా వేర్వేరు శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారని ఆయన ఆరోపించారు... దళితుడినని తనపై చిన్నచూపు చూస్తున్నారని, ఎస్సీలకు రిజర్వ్ అయిన నియోజకవర్గంలో అగ్రవర్ణాల పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి దీనిని బ‌ట్టి చూస్తుంటే రానున్న రోజుల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నార‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.