ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి స‌వాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mla kotam reddy sridhar reddy image
Updated:  2018-03-10 04:25:50

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి స‌వాల్

నెల్లూరు జిల్లాలో వైసీపీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ను ముఖ్యంగా టార్గెట్ గా పెట్టుకుంటుంది అధికార తెలుగుదేశం పార్టీ... ముఖ్యంగా నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్ కుమార్ అలాగే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి వీరి ఇరువురి పై ఎప్పుడూ అధికార పార్టీ ప‌గ‌ప‌డుతూనే ఉంటుంది అంటారు... ఇక జిల్లాకు చెందిన ఇద్ద‌రు మంత్రులు ఉండ‌టం కూడా ఇక్క‌డ తెలుగుదేశానికి పెద్ద ప్ల‌స్ అనుకుంటోంది.. కాని గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో వైసీపీ మెజార్టీ స్ధానాల్లో విజ‌యం సాధించింది. ఇప్పుడు మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మంత్రి నారాయ‌ణ ఎమ్మెల్సీలుగా ప‌ద‌వులు పొందారు..  అయితే ఇప్పుడు వైసీపీ త‌ర‌పున ఈ ఇరువురు ఎమ్మెల్యేల‌ను ఏదో ఓ వివాదంలో లాగాలి అని ప్ర‌య‌త్నిస్తోంది అధికార పార్టీ అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 
తాజాగా ఎమ్మెల్యే కోటం రెడ్డి స‌ర్కారు పై మండిప‌డ్డారు......తనపై మోపిన అక్రమ కేసులను ప్రజా పోరాటాలతోనే అడ్డుకుంటానని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి స్పష్టం చేశారు.  మీడియాతో మాట్లాడుతూ, కావాల‌నే  ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు. అన్యాయంగా విపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. ఈ స‌ర్కారు వ‌చ్చిన స‌మ‌యం నుంచి ఇలా వేధింపులు ఎక్కువ అయ్యాయి అని విమ‌ర్శించారు ఆయ‌న‌.
 
రాజకీయ ఒత్తిడులకు జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ తలొగ్గారని.. ఓఎస్డీ విఠలేశ్వర్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విచారణ హాజరయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పొలిటికల్‌ మైండ్‌ గేమ్‌లను అడ్డుకుంటానని.. ఆధారాలు ఉంటే కేసులు నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు. మొత్తానికి కేసులు పెట్టి ఇరికిస్తున్నార‌ని, అలా కాని ప‌క్షంలో పార్టీలోకి వ‌స్తే కేసుల స‌మ‌స్య ఉండదు అని చెబుతున్నారు అని,  ప‌లువురు నాయ‌కులను ఇలాగే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేర్చుకున్నారు అనే విమ‌ర్శ‌లు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.