మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డికి రాచ‌మ‌ల్లు కౌంట‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-25 11:25:53

మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డికి రాచ‌మ‌ల్లు కౌంట‌ర్

తాను తప్పు చేశాను అనైతిక‌త‌కు పాల్ప‌డ్డాను అని స్వ‌యంగా ఒప్పుకున్న రాష్ట్ర మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డికి,  అస‌లు జ‌గ‌న్ ను విమ‌ర్శించే నైతిక హక్కు విలువ లేదు అనే విమ‌ర్శ‌లు వైయ‌స్సార్ జిల్లాలో వినిపిస్తున్నాయి.. జిల్లాలో మెజార్టీ సీట్లు వైసీపీ గెలుచుకుంది కాని, ఇక్క‌డ జ‌గ‌న్ ను ఇరుకున పెడ‌దామ‌ని అన్ని విధాలుగా అధికార పార్టీ కుయుక్తులు ప‌న్నుతోంద‌ని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేశారు.
 
తాజాగా  ప్రొద్దుటూరు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు... రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో ఫ్యాక్ష‌నిజం ఓ ప‌క్క  త‌గ్గుతుంటే,  తాను ఒక ఫ్యాక్షనిస్టునని మంత్రి ఘనంగా చెప్పుకోవడం చాలా  దారుణమని అన్నారు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు.
 
జ‌గ‌న్ వ‌ద్ద పార్టీ టిక్కెట్లు తీసుకుని ఆగుర్తుపై గెలిచి ఆయ‌న్ని విమ‌ర్శించి పార్టీ మారి ప‌ద‌వులు పొందుతున్న మీకు జ‌గ‌న్ ను విమ‌ర్శించే హ‌క్కు లేద‌ని రాచ‌మ‌ల్లు ఫైర్ అయ్యారు.. జ‌గ‌న్ కేవ‌లం ప్ర‌త్యేక హోదా ఎవ‌రు ఇస్తే వారికి స‌పోర్ట్ చేస్తామ‌న్నారు..  ఒక‌వేళ బీజేపీ ప్ర‌త్యేక హోదా ఇస్తాము అంటే తాము బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని జ‌గ‌న్ చెప్పారు అని ఆయ‌న తెలియ‌చేశారు.. కాని దీనికి తెలుగుదేశం వ‌క్ర‌భాష్యాలు తీస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.
 
జ‌గ‌న్ చెప్పింది పార్టీ విధానాల‌క‌న్నా, ప్ర‌జ‌ల సంక్షేమం ముఖ్యం అని అన్నార‌ని.. అస‌లు మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి ప్ర‌త్యేక హోదాకు స‌పోర్టా కాదా అని ఆయ‌న్ని ప్ర‌శ్నించారు రాచ‌మ‌ల్లు. చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదాను గాలిలో వ‌దిలేసినా, తాము మాత్రం ప్ర‌త్యేక హోదా కోసం క‌ష్ట‌ప‌డి పోరాడుతున్నామ‌ని ఆయ‌న తెలియ‌చేశారు.
 
జగన్‌ క్రిస్టియన్‌ కాదని, క్రిటియన్‌ కూడా కాదని, ఆయన కస్టోడియన్‌ అని మంత్రి ఆదినారాయణరెడ్డి అర్థం లేని విమర్శలు చేశారన్నారు ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని ఓ ప్ర‌తిప‌క్ష నేత‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కస్టోడియన్‌ అంటే కస్టడీకి (జైలుకు) వెళ్లేవాడేనే అర్థంతో ఆదినారాయణరెడ్డి చెప్పారని, అయితే మంత్రి అబద్ధాలు చెప్పబోయి సత్యాన్ని పలికారని రాచమల్లు అన్నారు. కస్టోడియనే... అంటే సంరక్షకుడు అని అర్థమని, ఈ రాష్ట్ర ప్రజలను సంరక్షించడానికి ఉధ్బవించినవాడు జ‌గ‌న్ ... అని మంత్రి  ఆ విష‌యాన్ని గుర్తించాలి అని  ఆయన అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.