అసంతృప్తిలో టీడీపీ ఎమ్మెల్యే రావెల ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-28 05:12:48

అసంతృప్తిలో టీడీపీ ఎమ్మెల్యే రావెల ?

తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నా ఆయ‌న పై వైసీపీ మార్క్ వేసారు తెలుగుదేశం నేత‌లు.. ఆయ‌న వైసీపీలో చేరుతున్నారు అని, మంత్రి ప‌ద‌వి పోయిన స‌మ‌యం నుంచి వినిపిస్తూనే ఉన్నాయి... తాజాగా ఆయ‌న త‌న ఆవేద‌న తెలియ‌చేశారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో భూ అక్ర‌మాలు పెరిగిపోయాయి అని ఆగ‌డం లేద‌ని, మాజీ మంత్రి రావెలకిషోర్ బాబు అన్నారు..
 
గుంటూరు రూర‌ల్ మండ‌లం ఓబుల‌నాయుడిపాలెం క్వారీలో, ఆయ‌న ఆక‌స్మిక త‌నిఖీ  చేశారు.. అక్క‌డ మ‌ట్టిని అక్ర‌మంగా త‌వ్వుతున్నార‌ని అక్క‌డ‌నుంచి త‌ర‌లిస్తున్నార‌ని, ఇప్ప‌టికే వంద కోట్ల రూపాయల విలువైన మట్టిని తరలించారని, ఈ సందర్భంగా ఆరోపించారు. మైనింగ్, రెవిన్యూ, పోలీస్ అధికారులకు మామూళ్లు అందాయని పేర్కొన్నారు.  ఈవిష‌యం పై మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుకు తెలియ‌చేసినా ఎక్క‌డా ఈ భూ అక్ర‌మ‌ణలు ఆగ‌లేద‌ని ఆయ‌న అన్నారు.
 
ఇక ఈ ప్రాంతం త‌న సెగ్మెంట్ అవ్వ‌డం వ‌ల్ల ఇందులో త‌న పాత్ర ఉంది అని ప్ర‌జ‌లు భావిస్తున్నారు అని అన్నారు. త‌న‌కు కూడా ఈ అక్ర‌మాల్లో భాగం ఉంద‌ని, ఈ అవినీతిలో త‌న పాత్ర ఉంద‌ని ఇక్క‌డ ప్ర‌జ‌లు భావిస్తున్నారు అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
 
కొంత మంది దుర్బుద్ది వల్ల ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తోంది అని అన్నారు..ఇక నేరుగా మంత్రికి ఫిర్యాదు చేసినా ఇటువంటి దారుణాలు తెలుగుదేశంలో ఇంకెన్ని వెలుగులోకి రాకుండా జ‌రుగుతున్నాయో, అని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.