గాలి మృతి పై ఎమ్మెల్యే రోజా సంతాపం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-07 11:37:38

గాలి మృతి పై ఎమ్మెల్యే రోజా సంతాపం

చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్  నాయ‌కుడు, తెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్ నేత‌గా, మాజీ మంత్రిగా పేరుతెచ్చుకున్నారు గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు.. ఆయ‌న హైద‌రాబాద్ లో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ హఠాన్మ‌ర‌ణం చెందారు.. దీంతో పార్టీ నాయ‌కులు ఒక్క‌సారిగా కంగుతిన్నారు. ఆయ‌న మ‌ర‌ణం తీర‌ని లోట‌ని తెలుగుదేశం నాయ‌కులు ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల ఆవేదన వ్య‌క్తం  చేశారు.
 
గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు మృతికి వైసీపీ ఎమ్మెల్యే రోజా సంతాపం తెలిపారు.. చిత్తూరు జిల్లాలో సీనియ‌ర్ నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నార‌ని ఆమె కీర్తించారు.. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలి అని కోరుకున్నారు ఎమ్మెల్యే రోజా.... ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా ప‌నిచేసిన సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన ముద్దు కృష్ణ‌మ‌నాయుడు మ‌ర‌ణించ‌డం చిత్తూరు జిల్లాకు తీర‌ని లోటు అన్నారు ఆమె. ఓ సాధార‌ణ ఉపాధ్యాయుడిగా ఆయ‌న ప‌నిచేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్ర‌జాసేవ చేశార‌ని ఆమె కొనియాడారు. టీచ‌ర్ గా వ‌చ్చి విద్యాశాఖ‌మంత్రిగా ప‌నిచేయ‌డం ఆయ‌న‌కే ద‌క్కిన అదృష్టం అని అన్నారు ఎమ్మెల్యే రోజా.
 
గ‌తంలో తెలుగుదేశం పార్టీలో నేను ఆయ‌న క‌లిసి ప‌నిచేసిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ని, ఈరోజు ఆయ‌న లేరు అంటే బాధ‌గా ఉంది అన్నారు ఎమ్మెల్యే రోజా... ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాడ సానుభూతి తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.