శ్రీకాంత్ రెడ్డి ఐదు ప్ర‌శ్న‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-19 12:40:55

శ్రీకాంత్ రెడ్డి ఐదు ప్ర‌శ్న‌లు

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఒక రోజు పాటు చేప‌ట్టే నిరాహార దీక్ష పై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు... గ‌తంలో ఏడేళ్లు మ‌ళ్లీ ఇప్పుడు నాలుగేల్లు బీజేపీతో పొత్తుపెట్టుకుని రాష్ట్రానికి చంద్ర‌బాబు తీర‌ని ద్రోహం చేస్తున్నార‌ని అన్నారు.. ప్ర‌త్యేక హోదా కంటే ప్ర‌త్యేక ప్యాకేజి వల్లే అధిక లాభం వుంద‌ని చెప్పిన చంద్ర‌బాబు, ఇప్పుడు మాట మార్చి ప్ర‌త్యేహాదా కావాల‌నడం చాలా సిగ్గు చేట‌ని శ్రీకాంత్ రెడ్డి చంద్ర‌బాబు పై నిప్పులు చెరిగారు.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఒక మాట.. అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక మాట మాట్లాడ‌డం మ‌న ముఖ్య‌మంత్రికే చెల్లుతుంద‌ని అన్నారు.
 
వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలోని విలేకర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ... చంద్ర‌బాబు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు నిరాహార దీక్ష చేస్తున్నారా?, లేకపోతే నిరుద్యోగలందరికి ఉద్యోగాలు కల్పించి, నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు దీక్ష చేస్తున్నారా..? డ్వాక్రా మ‌హిళ‌ల‌కు పూర్తిగా రుణాలను మాఫీ చేయనందుకు దీక్ష చేపడుతున్నారా..? రైతన్నలను మోసగించినందుకు నిరాహారదీక్ష చేస్తున్నారా?  ఈ ప్రశ్నలన్నింటికీ ముందుగా సమాధానాలు చెప్పి చంద్ర‌బాబు నిరాహార దీక్ష చేయాల‌ని ప్ర‌శ్నించారు.
 
కేవ‌లం ఒక రోజు నిరాహార దీక్ష చేసేందుకు చంద్ర‌బాబు అక్ర‌మంగా ప్ర‌జ‌ల‌కు కేటాయించిన 50 కోట్ల రూపాయ‌ల‌ నిధుల‌ను కేటాయించుకున్నార‌ని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు... వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసిన‌ప్పుడు చంద్ర‌బాబు త‌మ ఎంపీల‌తో రాజీనామా చేయించి ఉంటే రాష్ట్రానికి ఇంత ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని అన్నారు... దేశంలో అత్యంత సీనియ‌ర్ రాజ‌కీయ‌నాయ‌కుడ‌ని ప్ర‌చారం చేసుకునే చంద్ర‌బాబు గ‌తంలో పెద్ద నోట్ల రద్దు విషయంలో మోడీకి స‌ల‌హా ఇచ్చాన‌ని గొప్ప‌లు చెప్పుకునే ఆయ‌న, ఆ నోట్ల రద్దు వలన ప్రజలు, వ్యాపారస్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కబడటం లేదా అని ప్రశ్నించారు శ్రీకాంత్  రెడ్డి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.