రాజుగారి స్పంద‌న ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

kambhampati haribabu and vishnu kumar raju
Updated:  2018-04-17 04:09:09

రాజుగారి స్పంద‌న ?

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబు త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే ...ఇక దీనిపై ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది... ఇప్పుడు ఈ స‌మ‌యంలో బీజేపీ ఇంత స‌డెన్ డెసిష‌న్ ఎలా తీసుకుంది అని అంద‌రూ ఆలోచిస్తున్నారు.ఆయ‌న అమిత్ షాకు లేఖ రాశారు.
 
అయితే బీజేపీకి ఏపీ అధ్య‌క్షుడు కొత్త‌గా ఎవరు రానున్నారు అనే ఉత్కంఠ  కొన‌సాగుతోంది.. అలాగే ఏపీ బీజేపీ ర‌థ‌సార‌ధిగా ఇప్పుడు ఎవ‌రు రానున్నారు అని జ‌నం చ‌ర్చించుకుంటున్నారు....ఈ అంశంపై బీజేపీ శాసనసభా పక్ష నేత  విష్ణుకుమార్‌ రాజు స్పందించారు. హరిబాబు రాజీనామా వెనుక రాజకీయ కోణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఆయన రాజీనామా చేశారన్నారు. ఆయన సమర్థవంతుడైన నాయకుడని కితాబిచ్చారు. మరోవైపు పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతిపై విచారణ చేయాలన్న తన వ్యాఖ్యాలకు కట్టుబడి ఉన్నట్టు ఆయన తెలిపారు. పట్టిసీమ అక్రమాలపై ఇతర పార్టీలు స్పందించాలి ఆయన కోరారు.
 
కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కంభంపాటి హరిబాబును ఎవరు ఒత్తిడి తేలేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌ కిశోర్‌ స్పష్టం చేశారు. పార్టీ ఆలోచనకు అనుగుణంగానే హరిబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తోందన్నారు. దీనికి వెసులుబాటు కల్పిస్తూనే హరిబాబు రాజీనామా చేశారు. ఇక త్వ‌ర‌లోనే అమిత్ షా కొత్త అధ్య‌క్షుడి పేరును ప్ర‌క‌టిస్తారు అని అంటున్నారు బీజేపీ నాయ‌కులు. ఇటు అధ్య‌క్షుని రేసులో మాజీ మంత్రి పైడికొండ‌ల మాణిక్యాల‌రావు పేరు ప్ర‌థ‌మంగా వినిపిస్తుంటే, సోమువీర్రాజు పురేందేశ్వ‌రి పేర్లు త‌దుప‌రి రేసులో ఉన్నాయి అని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.