పార్టీ మారి త‌ప్పు చేశా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-06 05:51:27

పార్టీ మారి త‌ప్పు చేశా

గోదావ‌రి జిల్లాలు  తెలుగుదేశం కంచుకోట అది ?  2004 ఎన్నిక‌లకు ముందు మాట... కాని 2004 లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక, దివంగ‌త సీఎం  రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న కంచుకోట‌లుగా  చేసుకున్నారు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌ను. కొంత‌మంది పార్టీలు మారి హ‌స్తం పార్టీలో చేరినా, కొంద‌రు తెలుగుదేశాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు.. సీనియ‌ర్ నాయ‌కుడు రాజమండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి గురించి అంద‌రికి తెలిసిందే,  నాడు ఎన్టీఆర్ నుంచి నేడు బాబు వ‌ర‌కూ గోరంట్ల పార్టీలో సేవ చేస్తున్నారు.. అయితే ఎన్టీఆర్ హాయాం నాటి నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్టిన బాబు అదే జాబితాలో గోరంట్ల‌ను చేర్చారు.
 
ఇక్క‌డ వైసీపీ త‌ర‌పున ఎమ్మెల్సీ ప‌ద‌వి పొంది, త‌ర్వాత పార్టీ ఫిరాయించారు  ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. పార్టీలో విభేదాలు వ‌స్తాయి అని తెలిసినా బాబు ఆయ‌న్ని పార్టీలోకి తీసుకున్నారు.. ఇటు వైసీపీలో తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌క్కంపూడి ఫ్యామిలీకి ఆయ‌న‌కు కూడా విభేదాలు ఉండేవి.. అయినా పార్టీలో ఇమ‌డ‌లేక బ‌య‌ట‌కు వ‌చ్చారు ఆదిరెడ్డి అప్పారావు.. దివంగత నేత ఎర్రన్నాయుడికి ఈయన వియ్యంకుడు కూడా.. అయితే వైసీపీ నుంచి వ‌చ్చిన త‌ర్వాత తెలుగుదేశం లో  ఈయ‌న ఊహించిన స్ధాయిలో పార్టీలో  స‌ముచిత స్ధానం ల‌భించ‌లేదు... పార్టీలో సొంత సెగ్మెంట్ నాయ‌కులే విమ‌ర్శించేవారు.
 
అయినా పార్టీ ఫిరాయింపులు దగ్గ‌ర ఉండి ప్రోత్స‌హించారు కాబట్టీ, తెలుగుదేశం నాయ‌కులే వారిని  కూల్ చేయ‌డానికి  ప్ర‌య‌త్నాలు ఇప్ప‌టికీ చేస్తూనే ఉన్నారు... ఇక తూ.గోలో వైసీపీ ఎమ్మెల్యేల‌పై టార్గెట్ పెట్టిన తెలుగుదేశం, ముందు ఎమ్మెల్సీని పార్టీలో చేర్చుకున్నారు, పార్టీలో చేర‌క‌ముందు  వార్ కంటే, పార్టీలో చేరిన త‌ర్వాత  ఆయ‌కు గోరంట్ల‌కు మ‌ధ్య మాట‌ల వార్  ఇంకా పెరిగింది.
 
తాజాగా రాజమండ్రి రూర‌ల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఫిరాయింపు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఒక‌రి పై ఒక‌రు స‌వాళ్లు విసురుకున్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు మంత్రి లోకేష్ తన జేబులో ఉన్నారంటూ ఆదిరెడ్డి ప్రచారం చేసుకుంటున్నార‌ని, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి  బూట‌క‌పు ప్రచారాలు చేసుకునే ఖర్మ తనకు లేదన్నారు. అయితే త‌న వ‌ర్గీయుల వద్ద పార్టీ మారి త‌ప్పు చేశాను అని మ‌ద‌న‌ప‌డుతున్నార‌ట ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.