ఏపీలో మ‌రో ఎన్నిక

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

mlc election schedule
Updated:  2018-04-21 06:10:48

ఏపీలో మ‌రో ఎన్నిక

ఏపీలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అయింది.... మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు (70) మరణంతో ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ నెల 24న ఎన్నికల నోటిషికేషన్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. 
 
ఇక మే 21న పోలింగ్ నిర్వహిస్తారు. మే 24న ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. 
 
స్వస్థలం చిత్తూరు జిల్లా వెంకట్రామపురంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆయన మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.దీంతో ఇప్పుడు ఈ ఉప ఎన్నిక అనివార్యం అయింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.