మ‌రో నాయ‌కుడికి రూ.5 కోట్లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-21 12:17:49

మ‌రో నాయ‌కుడికి రూ.5 కోట్లు

తెలుగుదేశం నాయ‌కులు వైసీపీ నాయ‌కుల‌ను పార్టీ ఫిరాయించేలా చేసి.. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 23 మంది ఎమ్మెల్యేల‌ను ముగ్గురు ఎంపీల‌ను సంతలో ప‌శువుల‌ను కొనుగోలు చేసిన‌ట్టు, క్ర‌య విక్ర‌యాలు చేసిన విష‌యం తెల‌సిందే.. అయితే ఈ ఉచ్చులోకి దించేందుకు అనేక మందితో సంప్ర‌దింపులు జ‌రిపారు తెలుగుదేశం నేత‌లు... ఇటీవ‌ల కొడుమూరు ఎమ్మెల్యే మ‌ణిగాంధీ అన‌వ‌స‌రంగా పార్టీ మారాను అని చెప్ప‌డంతో, ఇప్పుడు  ఈ  ఫిరాయింపుల అంశం మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది... తాజాగా ఓ ఎమ్మెల్సీ త‌న‌కు తెలుగుదేశం ఎంత ఆఫ‌ర్ చేసిందో తెలియచేశారు.
 
ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ఆయన‌ను అంద‌రూ ముద్దుగా మాస్టారు అని పిలుచుకుంటారు.. నిజంగా రాజ‌కీయాల్లో ఆయ‌న లాంటి వ్య‌క్తులు ఎవ‌రూ ఉండ‌రు అనే చెప్పాలి..ఏలూరు సీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదవీవిరమణ చేశారు... ఆయ‌న ప‌ద‌వీవిర‌మ‌ణ త‌ర్వాత వ‌చ్చిన న‌గ‌దు అలాగే ఆయ‌న‌కు వార‌స‌త్వంగా వ‌చ్చిన పొలం స‌మాజ‌సేవ‌కు పేద విద్యార్ధుల చ‌దువుకు ఖర్చుచేసి,  ఎటువంటి ఆస్తి త‌న‌కంటూ ఉంచుకోకుండా ఉన్న ఓ గొప్ప‌వ్య‌క్తి.. ఆయ‌న వ‌ద్ద చ‌దువుకొని ఇత‌ర దేశాల్లో వంద‌లాద మంది ఉద్యోగాల్లో ఉన్నారు అనే విష‌యం ఆయ‌న‌కు ఎంతో ఆత్మ సంతృప్తి ఇస్తుంది అంటారు.. పేద‌ల‌కు ఉచిత విద్య వారికి ఫిజులు క‌ట్ట‌డానికే ఆయ‌న జీతంలో స‌గం ఖ‌ర్చుచేసేవారు ఆయ‌నే ఎమ్మెల్సీ రాము సూర్యారావు.
 
ఆయ‌న‌ను కూడా తెలుగుదేశం వ‌ద‌ల‌లేదు.. ఎమ్మెల్సీగా నామినేష‌న్ వేసిన స‌మ‌యంలో పోటీ నుంచి త‌ప్పుకుంటే ఐదు కోట్ల రూపాయ‌లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌.. నామినేష‌న్ వేసినా ప‌ర్వాలేదు మీరు ప్రచారానికి వెళ్ల‌కుండా ఉంటే స‌రిపోతుంది అని అన్నార‌ట‌... ఈ విష‌యాన్ని ఆయ‌న తాజాగా ఓ చ‌ర్చావేదిక‌లో బయ‌ట‌పెట్టారు. ఇక ఎమ్మెల్యేల‌కు ఎన్ని కోట్ల రూపాయ‌లు ఇచ్చి కోనుగోలు చేశారో అనే  విమ‌ర్శలు ప్ర‌జల నుంచి వినిపిస్తున్నాయి. త‌న‌కు ఈ ఆఫ‌ర్ వ‌ద్ద‌ని చెప్పార‌ట, ఈ విష‌యాన్ని పీడీఎఫ్ రాష్ట్ర అధ్య‌క్షునితో రాము సూర్యారావు తెలిపాన‌ని వెల్ల‌డించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.