బొత్స స‌మ‌క్షంలో వైసీపీలోకి చిరంజీవి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

botsa sathya narayana
Updated:  2018-08-06 04:23:38

బొత్స స‌మ‌క్షంలో వైసీపీలోకి చిరంజీవి

2019 ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించి గతంలో రాజ‌కీయంగా ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ నాయ‌కులతో పాటు ప్ర‌స్తుతం అధికార తెలుగుదేం పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ నుంచి అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి అనుచ‌రుడు, కోస్తా నుంచి టీడీపీ నాయ‌కుడు య‌ల‌మంచిలి ర‌వితోపాటు వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఫ్యామిలీలు వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 
 
ఇక ఇదే క్ర‌మంలో శ్రీకాకుళం జిల్లా ఫ‌రీద్ పేట గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయ‌వాది మొద‌ల‌వ‌ల‌స చిరంజీవి వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. న్యాయ వృత్తితో పాటు ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌లో బిజీగా ఉన్న చిరంజీవి ఇప్పుడు ప్ర‌త్యేక రాజ‌కీయాల్లోకి అడుగు వేయ‌డంతో వైసీపీకి మరింత బ‌లం చేకూరిన‌ట్లు అయింది.
 
పార్టీ తీర్థం తీసుకున్న త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయబోయే న‌వ‌ర‌త్నాల‌కు తాను ఆక‌ర్షితులు అయ్యాన‌ని అందుకే తాను వైసీపీ తీర్థం తీసుకున్నానని స్పష్టం చేశారు. అంతేకాదు  జ‌గ‌న్ ను ముఖ్య‌మంత్రిని చేసేందుకు త‌న‌వంతు కృషి చేస్తాన‌ని చిరంజీవి తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.