బాబు పై మోదీ కొత్త నిర్ణయం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-21 12:43:38

బాబు పై మోదీ కొత్త నిర్ణయం

బ్ర‌తిమాలినంత సేపూ... బ్ర‌తిమాలాం... చేయ‌వ‌ల‌సినవ‌న్ని చేశాం.. ఇక స‌మ‌యం లేదు ఆ ఓపిక లేదు అనే విధంగా సీఎం చంద్ర‌బాబు కేంద్రానికి కాస్త చుర‌క‌లు అంటిస్తున్నారు బిగ్గ‌ర‌గా.. ఇక స్వ‌రం పెంచే ఉద్దేశం బాబుకు ఉంద‌ని ఇటు ఏపీ క‌మ‌లం నాయ‌కులు కూడా గ్ర‌హిస్తున్నారు.. మొత్తానికి ఏపీకి బీజేపీ ఈ మూడున్న‌ర సంవ‌త్స‌ర‌కాలంలో చేసింది ఏమీ లేద‌ని కేవ‌లం బాబు బ్రాండ్ వ‌ల్ల, ఏపీకి  కోర‌కుండానే నిధులు పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని తెలుగుదేశం నాయకులు ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు.

ఇక పోల‌వ‌రం ప్రాజెక్ట్ పై ప్ర‌శ్న‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ అన్నింటా క‌మీష‌న్లు  కాంట్రాక్టులు త‌మ అనుకున్న వారికి తెలుగుదేశం నాయ‌కుల‌కే ఇస్తున్నారు అని అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి తెలుగుదేశం పై.. ఇక ఈ వివాదాల‌కు కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టాల‌ని భావిస్తోంది..పోల‌వ‌రం నిధుల పై ప్ర‌శ్నిస్తే దీనిపై స‌మాధానం చెప్పలేదు, కేంద్రానికి కాస్త క్రెడిట్ కూడా ఇవ్వ‌డం లేదు అనేది బీజేపీ ఆలోచిస్తున్న అంశం.

 చివ‌ర‌కు కేంద్ర‌మంత్రి నితిన్ గడ్క‌రీతో, అదే విధంగా ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీతో చ‌ర్చించారు సీఎం చంద్ర‌బాబు. ఎప్ప‌టి తీరు ఈ భేటీలో జ‌రిగింది అని ఇంట‌ర్న‌ల్ గా తెలుగుదేశం నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.. దీనితో రాజ‌కీయంగా బాబు మోదీని ఇరుకున పెడ‌దాం అని ఆలోచిస్తున్నారు.. కాని పరిస్ధితి దీనికి భిన్నంగా ఉంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గ‌తంలో కంటే మోదీ హవాతో నోట్ల ర‌ద్దు త‌ర్వాత కూడా 62 శాతం ఓటింగ్ ను సాధించుకుంది.

ఇవ‌న్ని బీజేపీకి ప్ల‌స్.. దీనితో సౌత్ లో తాము స్వ‌తంత్రంగా ఎద‌గ‌క‌పోయినా ఏ ప్రాంతీయ పార్టీ అయినా త‌మ‌తో పొత్తుకు సిద్దం అనేది మోడీ అమిత్ షా అభిప్రాయం.. ఇక ఈ వ్య‌వ‌హారానికి  బాబు వ్యాఖ్య‌లు మ‌రింత ఆజ్యం పోసేలా ఉంటున్నాయి..రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే.. న్యాయం చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం  అని అన‌డంతో ఈ విష‌యం ఏపీ బీజేపీ నాయ‌కులు కూడా కేంద్రానికి తెలియ‌చేశారు.. ఇక కోర్టులో చూసుకుందాం అనే విధంగా కేంద్రంలో సీనియ‌ర్లు అంటున్నార‌ని, ఇదే ప‌ద్ద‌తి బాబు అవ‌లంభిస్తే ఈ ఏడాది ద్వితీయార్దంలో కేంద్రం బాబుకు క‌టీఫ్ చెప్పడం ఖాయం అని హ‌స్తిన‌లో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.