చంద్రబాబు ను లాక్ చేసేందుకు అన్ని రాష్ట్రాలను సిద్ధం చేసిన మోడీ...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

modi and babu
Updated:  2018-10-12 03:35:56

చంద్రబాబు ను లాక్ చేసేందుకు అన్ని రాష్ట్రాలను సిద్ధం చేసిన మోడీ...

2014లో మోడీ క్రేజ్‌ని ఉపయోగించుకుని ఎన్నికల్లో గట్టెక్కిన చంద్రబాబు... మోడీ హవా గట్టిగా ఉన్నంత కాలం మోడీ భజన చేస్తూ అన్ని రకాలుగానూ లాభపడ్డాడు. తీరా మోడీ డౌన్ అయ్యాక మోడీకి హ్యాండ్ ఇవ్వడమే కాకుండా పూర్తిగా రివర్స్ అయ్యాడు. మోడీ ఇమేజ్‌ని పాతాళానికి పడగొట్టడం, మోడీని మళ్ళీ ప్రధాని అవ్వకుండా చూడడమే లక్ష్యం అన్నంత రేంజ్‌లో రెచ్చిపోతున్నాడు.

తనను వాడుకుని వదిలెయ్యడమే కాకుండా....ఇప్పుడు తన పతనమే లక్ష్యం అన్న రేంజ్‌లో చంద్రబాబు రెచ్చిపోతూ ఉంటే మోడీ ఊరికే ఉంటాడా..? గుజరాత్‌లో తన సొంత పార్టీ నేతలు తన ఎదుగుదలకు అడ్డుపడితేనే తొలగించుకున్న మోడీ, అద్వానీలాంటి నాయకుడిని పడక్కుర్చీ నేతగా మార్చేసిన మోడీ తనను వాడుకుని వదిలేసిన, తనను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబును మాత్రం ఎందుకు వదులుతాడు..?

అందుకే ఇప్పుడు ఎవరూ ఊహించని వైపు నుంచి చంద్రబాబును దెబ్బకొట్టడానికి రెడీ అయ్యాడు మోడీ. నోట్ల రద్దు నిర్ణయానికి కేవలం రెండు రోజుల ముందు కూడా హెరిటేజ్‌కి ఓ స్థాయిలో లాభం వచ్చే నిర్ణయం జరిగింది. ఇక బాబు అధికారంలోకి ఎప్పుడు వచ్చినా కూడా ప్రభుత్వ డెయిరీలన్నీ మూతపడతాయన్నది అందరికీ తెలిసిన సత్యం. చిత్తూరు డెయిరీతో సహా ఎన్నో డెయిరీలను హెరిటేజ్ కోసం పతనం దిశగా చంద్రబాబు నడిపించాడని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆవేధన వ్యక్తం చేస్తూ ఉంటారు. దశాబ్ధాలు కష్టపడి, అధికారాన్ని, పలుకుబడిని ఉపయోగించుకుని డెవలప్ చేసుకున్న ఆ హెరిటేజ్‌పైనే ఇప్పుడు మోడీ కన్నేశాడని విచారణా సంస్థల నుంచి సమాచారం తెలుస్తోంది.

హెరిటేజ్ ఫుడ్స్ విషయంలో గతంలో కూడా చాలానే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. హెరిటేజ్ చుట్టూ ఉన్న అవినీతి, అక్రమాలపై సమర్థవంతంగా విచారణ జరిపితే చంద్రబాబు అడ్డంగా బుక్కవ్వడం ఖాయం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హెరిటేజ్‌ అక్రమాలపై దాడులను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై దాడులుగా, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే చర్యగా చంద్రబాబుతో పాటు ఆయన పచ్చ మీడియా అంతా కూడా ప్రచారం చేయగలదు కానీ ప్రజలు ఎవరూ నమ్మరు అన్న నిర్ణయానికి బిజెపి పెద్దలు వచ్చారని తెలుస్తోంది.

మరి హెరిటేజ్‌ అక్రమాలు, అవినీతిపై దాడులు జరిగితే చంద్రబాబు అండ్ కో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అలాగే బాబు బాకా ఊదడానికి పనికివచ్చే మైకులా తయారైన నటుడు శివాజీ ఈ మొత్తం వ్యవహారాన్ని మొత్తం తెలుగు ప్రజలపై దాడిగా చిత్రీకరించే ప్రయత్నం ఎంత సమర్థవంతంగా చేస్తాడో చూడాలి మరి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.