చేతులెత్తేసిన మోదీ బాబుకు క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-06 03:40:55

చేతులెత్తేసిన మోదీ బాబుకు క్లారిటీ

ఆ నాడు ఎంపీలు అంద‌రూ క‌లిసి తెలంగాణ ను విడ‌గొట్టిన స‌మ‌యంలో ఎటువంటి  నిర‌స‌న‌లు ఎంపీలు తెలిపారో  తెలిసిందే, ఇక ఆల్ పార్టీ నాయ‌కులు అంద‌రూ క‌లిసి నిర‌స‌న‌లు ప్ర‌త్యేక హోదా కోసం డిమాండ్లు చేసిన విష‌యం తెలిసిందే... అయితే ఏపీ ఎంపీల‌కు ఆ బాధ‌లు త‌ప్పేలా లేవు, విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత అవ‌శేష ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కేంద్రం ఎటువంటి హామీలు నెర‌వేర్చ‌డం లేదు.... అలాగే తెలుగుదేశం ఎంపీలు వైసీపీ ఎంపీలు   గ‌తంలో ఇచ్చిన హామీల‌పై  డిమాండ్ల కోసం  పార్ల‌మెంట్లో సేవ్ ఏపీ అంటూ, నినాదాలు చేశారు ప్ల‌కార్డుల‌తో త‌మ నిర‌స‌న తెలియ‌చేశారు..
 
ఈ రోజు ఉద‌యం  కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రితో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చ‌ర్చించారు.. ఏపీకి తాము న్యాయం చేస్తామ‌ని బాబును ఎటువంటి డెసిష‌న్ తీసుకోవ‌ద్ద‌ని చెప్పార‌ట, ఇదే విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు కు సీఎం ర‌మేష్ తెలియ‌చేశారు.
 
అయితే ఇటు ఏపీలో క‌మ‌లం నాయ‌కులు దీనిని కొట్టిపారేస్తున్నారు... న‌మ‌స్కారం పెడ‌తాం అని చెప్పింది తెలుగుదేశం, అలాంటి స‌మ‌యంలో బీజేపీ త‌ర‌పున మోదీ ఎందుకు చెప్పుతారు అని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ఇదే విష‌యాన్ని బాబు ఆస్ధాన మీడియా హైలెట్ చేస్తోంది. దెబ్బ‌కు దిగి వ‌చ్చిన మోదీ అంటోంది... అయితే దీనిపై మ‌ళ్లీ కేంద్రానికి సంకేతాలు పంపుతున్నారు ఏపీ క‌మ‌లం నాయ‌కులు.... గుడ్ బై చెబితే చెప్పుకోండి అనేలా మోదీ తెలుగుదేశానికి క్లారిటీ ఇచ్చి ఉంటార‌ని అంటున్నారు బీజేపీ నాయ‌కులు.. మ‌రి నిజా నిజాలు మంత్రికి, ప్ర‌ధాన మంత్రికి, బాబుకి, పెరుమాళ్ల‌కే ఎరుక.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.