ప్ర‌పంచంలో ఇదే ఫ‌స్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-19 06:14:01

ప్ర‌పంచంలో ఇదే ఫ‌స్ట్

హైదరాబాద్ హైటెక్స్‌ వేదికగా జ‌రుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సును  ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడురోజుల పాటు జరగనున్న ఐటీ కాంగ్రెస్‌ సదస్సును ప్ర‌ధాని మోదీ దిల్లీ నుంచి వీడియో కాన్ప‌రెన్స్ ద్వారా ప్రారంభిచారు. ఈ కార్య‌క్ర‌మానికి హ‌జ‌రైన అతిధుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగించారు.
 
వివిధ దేశాల నుంచి ఈ స‌ద‌స్సుకు విచ్చేసిన పారిశ్రామికవేత్త‌ల‌కు, ప్ర‌తినిధుల‌కు భారత్, హైదరాబాద్ ఆహ్వానం పలుకుతోంద‌ని అన్నారు. అధికారంలోకి వ‌చ్చిన ఎన్డీయే ప్ర‌భుత్వం దేశం డిజిటల్‌ ఇండియా వైపు అడుగులు వేయ‌డానికి అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టింద‌ని తెలిపారు. అందులో భాగంగానే ఆప్టికల్ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను లక్ష గ్రామాలకు అనుసంధానించామని ప్ర‌ధాని తెలిపారు. భార‌తదేశం సాంకేతికంగా అభివృద్ది చెందాల‌న్న మా ఆలోచ‌న‌కు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ స‌ద‌స్సు నిర్వ‌హించ‌డం భార‌త్‌లో ఇదే  మొద‌టిద‌ని, ఇది తెలంగాణా అదృష్టం అని అన్నారు.  
 
డిజ‌ట‌లైజేష‌న్ అవ్వ‌డానికి జన్‌ధన్ ఖాతాలను అమ‌లు చేశామ‌ని, త‌ద్వారా దేశ ప్ర‌జ‌లు 32 కోట్ల కొత్త ఖాతాలను ప్రారంభించార‌ని తెలిపారు. దీంతో 57 వేల కోట్లను ప్రభుత్వం ఆదా చేసిందని తెలియ‌జేశారు. 470 వ్యవసాయ మార్కెట్లను ఈ-నామ్‌కు అనుసంధానించామని, దేశంలో 60 మిలియన్ల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యంగా చర్యలు చేపట్టామని మోదీ పేర్కోన్నారు. ఆర్థిక లావాదేవిలు సాంకేతికంగా జ‌ర‌గ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వానికి ఆదాయం స‌మ‌కూరుతున్న‌ద‌ని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భార‌త‌దేశం డిజిటల్‌ సాంకేతిక ఆవిర్భావానికి, నూతన ఆవిష్కరణలకు  ప్రధాన కేంద్రంగా నిలుస్తోందని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.