మోదీ ఏపీపై టార్గెట్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-28 18:12:10

మోదీ ఏపీపై టార్గెట్ ?

ఏపీ రాజ‌కీయాల్లో ఎక్క‌డో సంధింగ్ సంధింగ్ గా ఉంది అనే మాట‌లు వినిపిస్తున్నాయి.. సీఎం చంద్ర‌బాబు గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌వ‌డం...కేంద్రం నిఘా విభాగం అధిప‌తి రాజీవ్ జైన్ విజ‌య‌వాడ వ‌చ్చి బాబును క‌ల‌వ‌డం.. కేంద్రం మ‌న‌ల్ని ఇబ్బంది పెట్టాల‌ని చూస్తోంది... నాకు వ‌ల‌యంగా పెద్ద పెద్ద కంచెలు వేసుకుని నిల‌వండి అని ప్ర‌జ‌ల‌ను కోర‌డం...నాకు అండ‌గా ఉండండి అని నేరుగా ముఖ్య‌మంత్రి ధ‌ర్మ పోరాట దీక్ష‌లో కోరడం పై ఇప్పుడు అంద‌రూ ఆలోచ‌న‌లో ప‌డ్డారు..
 
ఇక బాల‌య్య మోదీ పై చెప్ప‌కూడ‌ని, అన‌కూడ‌ని, విన‌కూడ‌ని మాటలు తిట్ట‌డం... మ‌ళ్లీ తాను త‌ప్పు మాట్లాడ‌లేదు అని స‌మ‌ర్దించ‌డం త‌న‌కు తానుగా సెల్ప్ స‌ర్టిఫికెట్ ఇచ్చుకోవ‌డం ఓ మాయ‌లా క‌నిపిస్తోంది.. ఇక్క‌డ ఏపీలో త‌మ‌కు కేంద్రం అంటే నెవ‌ర్ అనే రేంజ్ లో చేస్తోంది సైకిల్ పార్టీ.. అయితే ఇప్పుడు క‌ర్ణాట‌క‌ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇక్క‌డ  రాజ‌కీయం పై బీజేపీ ఎటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు అని మేధావులు చ‌ర్చించుకుంటున్నారు.
 
గ‌తంలో బీహార్ యూపీ ఎన్నిక‌లు ప‌రిశీలించిన స‌మ‌యంలో కూడా అంతే  మోదీ ఎన్ని కామెంట్లు వ‌చ్చినా మౌనంగానే ఓ స్మైల్ ఇచ్చేవారు....ఏకంగా గుజ‌రాత్ లో అయితే  త‌న పైఎలా కాంగ్రెస్ విమర్శ‌లు చేస్తుందో చూడండి... ఆ దూష‌ణ‌లు చూడండి అని ప‌దే ప‌దే సోష‌ల్ మీడియాలో కూడా నిరంత‌రం చ‌ర్చ‌ల‌కు తావిచ్చారు..కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొల్ల‌గొట్టారు..
 
అదునుచూసి రాజ‌కీయం చేయ‌డం మోదీకి తెలిసిన విద్య‌... అవును ఆయ‌న కూడా వ‌చ్చింది అదే పొలిటిక‌ల్ స్కూల్ నుంచి... ఆయ‌న నేరుగా సీఎం అయిన వ్య‌క్తి కాదు?  రాజ‌కీయాల్లో రాటుతేలిన వ్య‌క్తి?  సీనియ‌ర్ అని డ‌బ్బా కొట్టే వ్య‌క్తి కానే కాదు అనేది బీజేపీ వాద‌న‌.. ఇక ఆయ‌న కూడా ముందు ముఖ్య‌మంత్రిగా పని చేశారు గుజ‌రాత్ కు, రాష్ట్ర  రాజ‌కీయాలు ఎలా  జ‌రుగుతాయో ఆయ‌న‌కు తెలుసు.
 
ఇక ప్ర‌ధాని పై తెలుగుదేశం ఎటువంటి కామెంట్లు చేస్తున్నా అన‌రాని మాట‌లు అంటున్నా అంత‌ర్గ‌తంగా దేశంలోనే ఇటువంటి విమ‌ర్శ‌లు ప్ర‌ధానిపై వ‌స్తున్నాయి అని నేష‌న‌ల్ మీడియా కూడా  హైలెట్ చేస్తున్నా.. క‌ర్ణుడిలా ఓపిక‌గా ఉంటున్నాడు అని బీజేపీ అంటోంది.... అయితే సైకిల్ పార్టీ మాస్ట‌ర్ ప్లాన్ క‌మలం పార్టీ ఎప్పుడో ప‌సిగ‌ట్టింది.
 
దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యం బాబు ప్లాన్ ఉంది అంటున్నారు బీజేపీ నాయ‌కులు... క‌న్న‌డ రాజ‌కీయాల్లో తానే చ‌క్రం తిప్పాను మోదీ పై వ్య‌తిరేక‌త‌ను తానే ముందు తీసుకువ‌చ్చాను అని చెప్ప‌డానికి మాత్ర‌మే బాబు ఆలోచ‌న అంటోంది బీజేపీ.. ఇక్క‌డ బాబు ఉద్యోగాలు ఇవ్వ‌క -  రాజ‌కీయాలు చూడ‌లేక స‌రైన ప‌థ‌కాలు అమ‌లు చేయ‌కపోతే  బెంగ‌ళూరు వెళ్లి బ‌తుకుతున్నాము అని ఇక్క‌డకు వ‌చ్చిన యువ‌త అంటున్నారు.
 
ఏపీ అయిపోయింది ఇక్క‌డ కూడా బాబు రాజ‌కీయాలు స్టార్ట్ అయ్యాయి అని విమ‌ర్శిస్తున్నారు సీమ యువ‌త‌..ఇక గ‌తంలో బాల‌య్య చేసిన ప‌నికే ఎంత రేంజ్ రాజ‌కీయం ఆ నాడు జ‌రిగిందో అందరికి తెలిసిందే.. ఇక రాజ‌భాష లో   మోదీని తిడుతూ త‌న హిందీతో మ‌రోసారి బాల‌య్య చెల‌రేగారు...ఇక  రాష్ట్రంలో ఇప్పుడు బాల‌య్య  వ్యాఖ్య‌ల పై  బీజేపీ నుంచి మ‌రింత ప్రెజ‌ర్  పెరుగుతోంది..
 
వారించ‌డం కాదు క‌దా బాల‌య్య చేసిన వ్యాఖ్య‌లు క‌రెక్ట్ అని తెలుగుదేశం నేత‌లు  చెబుతున్నారు. మ‌రి బాల‌య్య కూడా తాను క‌రెక్ట్ అంటున్నారు అందులో త‌ప్పు లేదు అంటున్నారు....ఇక క‌ర్ణాట‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలుగుదేశం నేత‌ల వ్యాఖ్య‌ల‌ను హైలెట్ చేయ‌కండి అని బీజేపీ పై కావాల‌నే వారు చేస్తున్న కుట్ర అంద‌రికి తెలుసు అని  ఎన్నిక‌ల వ‌ర‌కూ సంయ‌మ‌నం పాటించాలి అని అంటున్నారట అధిష్టానం నుంచి..
 
ఇక అమిత్ షా- మోదీ నిర్ణ‌యాలు  మే చివ‌రికి ఎలా మార‌నున్నాయో చూడాలి అని కొంద‌రు మేధావులు వ్యాఖ్య‌లు చేస్తున్నారు.... అద్వాని లాంటి సీనియ‌ర్ కూడా మోదీ రాజ‌కీయాల‌కి సైలెంట్ అయ్యారు అని అంటున్నారు.. అయితే ప్ర‌పంచంలోనే రాజ‌కీయాల్లో సీనియ‌ర్ అయిన చంద్ర‌బాబు ఎందుకు సైలెంట్ అవుతారు... మోదీ కూడా ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా చేస్తారట‌..2019 ఎన్నిక‌ల్లో  25 సీట్ల‌తో  ప్ర‌ధాని ప‌ద‌విని డిసైడ్ చేస్తాను అంటున్నారు చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌తో.....దీనికి త‌మ్ముళ్లు కూడా స‌పోర్ట్ చేస్తున్నారు..... చూడాలి మే నెల‌లో రోహిణి కార్తె టైం ఏపీలో బీజేపీ టైం రెండూ సేమ్ అంట‌..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.