హోదాకు మోడీ గ్రీన్ సిగ్న‌ల్ కానీ జ‌గ‌న్ ఆ ప‌ని చెయ్యాలి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-23 18:49:00

హోదాకు మోడీ గ్రీన్ సిగ్న‌ల్ కానీ జ‌గ‌న్ ఆ ప‌ని చెయ్యాలి

రాజకీయాల్లో శాశ్వత శ‌త్రువులు శాశ్వత మిత్ర‌లు ఉండ‌ర‌నే మాట పుట్టుక‌తో వ‌చ్చిన పుట్టు  మ‌చ్చ‌లాంటిది. అది చ‌రుగ‌దు మ‌నిషి చ‌చ్చే వ‌ర‌కు ఆ పుట్టు మ‌చ్చ అలాగే ఉంటుంది. రాజ‌కీయాల్లో కూడా శాశ్వత శ‌త్రువులు ఉండ‌రు. గతంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌ను తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించిన నాయ‌కులు కూడా అధినేత స‌మ‌క్షంలో పార్టీ మారుతుంటారు కొంద‌రు నాయ‌కులు. ఇదే క్ర‌మంలో ఒక‌రికి వ్య‌తిరేకంగా ఒక‌రు పార్టీ స్థాపించిన అధినేత‌లు కూడా కొన్ని సంద‌ర్భాల్లో ఒక్క‌టి అవుతుంటారు. 
 
అయితే తాజాగా భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు మిత్రుల కోసం గాలం వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం టీడీపీకి బీజేపీ గుడ్ బై చెప్పిన త‌ర్వాత ఆ పార్టీ ఏపీలో ఒంట‌రి అయిపోంది. ఇక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అర్జెంట్ గా మిత్రుడు కావాల‌నే ఉద్దేశంతో బీజేపీ, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైపు చూస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.
 
అయితే జ‌గ‌న్ మాత్రం విభ‌జ‌న చట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదాను ఏపీకి ఏ పార్టీ అయితే ఇస్తామ‌ని తొలి సంత‌కం పెడుతుందో ఆ పార్టీకే తాము మ‌ద్ద‌తు తెలుపుతామ‌ని భీష్మించి కూర్చున్నారు. ఇక చేసేది ఏమి లేక రాష్ట్రంలో పార్టీ బ‌లం చేకూర్చాలంటే ఏపీకి ప్ర‌త్యేక‌ హోదాను ఖ‌చ్చితంగా ఇవ్వాల‌ని మోడీ ఆలోచిస్తున్నార‌ట‌. 
 
దీంతో చంద్ర‌బాబు నాయుడు అప్ర‌మ‌త్త‌మ‌య్యార‌ని తెలుస్తోంది. గ‌తంలో త‌మ‌తో ఉన్న‌ప్పుడు బీజేపీ అడ్డ‌గోలుగా వ్య‌వ‌హరించి ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌కుండా ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ఏపీకి ప్ర‌త్యేక హోదాను ఇచ్చి వైసీపీతో చెట్టాప‌ట్టాలు వేసుకోవాల‌ని చూస్తుందంటు చీక‌ట్లో ఓ రాయి విసిరినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మ‌ధ్య కాలంలో రాష్ట్ర బీజేపీ నాయ‌కులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బాగానే వెన‌కేసుకొస్తున్నారు.
 
అయితే వైఎస్ జ‌గ‌న్ మాత్రం బీజేపీని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నా కూడా వాటిపై స్పందించకున్నారు బీజేపీ నాయ‌కులు. ఇక రానున్న రోజుల్లో వైసీపీ, బీజేపీ గ్యాప్ ను కూడా ఫిల్ చేసి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇచ్చి పార్టీకి బ‌లం చేకుర్చాల‌ని చూస్తున్నార‌ట‌. ఒకవేళ‌ మోడీ మ‌రి కొద్ది నెలల్లో హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తే ఆ క్రెడిట్ మొత్తం జ‌గ‌న్ మొహ‌న్ రెడ్డికి ద‌క్కుతుంద‌నే విష‌యం న‌మ్మ‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.