చంద్రబాబుకి సినిమా చూపించే ప్లాన్ వేసిన మోడీ.. ఇక చుక్కలే..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

modi and chandrababu naidu
Updated:  2018-10-17 01:50:28

చంద్రబాబుకి సినిమా చూపించే ప్లాన్ వేసిన మోడీ.. ఇక చుక్కలే..

రాజాకీయాల్లో తమకు అడ్డు వచ్చేవాల్లని, వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారిని తొక్కయేడం చాలా సందర్భాల్లో చూశాం. తమకంటే పై అధికారంలో ఉన్న వాల్లతో పెట్టుకుంటే పరిస్థితులు తారుమారు అవుతాయి. మోదీకీ ఎవరు ఎదురు తిరిగినా పాతాళానికి తొక్కేయడంలో మోడీ తరువాతే ఎవరయినా. అద్వానీ లాంటి సీనియర్ నేతలనే అడ్రస్ లేకుండా చేశారు మోడీ. మరి చంద్రబాబు ను అడ్రస్ లేకుండా చేయడానికి మోడీ అదిరిపోయే ప్లాన్ వేశాడట..మరి ఆ ప్లాన్ ఏంటి ఇప్పుడు చూద్దాం..
 
భాజాపాతో విడాకులు తీసుకున్న తరువాత చంద్రబాబు మోదీపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేకహోదా పేరుతో ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని నానా యాగీ చేయడం, కేంద్రం సహకరించడం లేదని ప్రచారం చేయడం, మోదీ కంటే నేనే సీనియర్ అంటూ దెప్పిపొడవడం.. ఇవన్నీ అక్కడ రికార్డ్ అయ్యాయంట. అందుకే బాబుకు ఇప్పుడు చుక్కలు చూపించేందుకు కేంద్రం రెడీ అయ్యింది.
 
కొన్ని రోజులుగా రెండుతెలుగు రాష్ట్రాల్లో టీడీపీనేతలపై ఐటీ దాడులు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇక చంద్రబాబుకు బినామీ అనే ఆరోపనలు ఎదుర్కొంటున్న సీఎం రమేష్ ఇంటిపై ఐటీ దాడులు చేయడంతో బాబు అండ్ కో వణికిపోతున్నారు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే నంట..అసలు పిక్చర్ ముందుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఐటీ దాడులు జరుగుతున్నా అవన్నీ కేంద్రం కక్షతో చేయిస్తోందని మేకపోతు గాంభీర్యం మాటలు మాట్లాడుతున్నారు పార్టీ నేతలు