మోదీ నోట జ‌గ‌న్ మాట ఎందుకు?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pm narendra modi and ys jagan mohan reddy
Updated:  2018-04-13 12:59:44

మోదీ నోట జ‌గ‌న్ మాట ఎందుకు?

మోదీ నోటి వెంట జ‌గ‌న్ మాట ఈ మాట విన‌డానికి కాస్త ఆలోచ‌న‌గా ఉంది క‌దా? అవును ఇప్ప‌డు జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో ఇదే విష‌యం హైలెట్ చేస్తోంది ఆస్ధాన మీడియా.. అవును ఓ ప‌చ్చ ప‌త్రిక ఈ విష‌యాన్ని రివీల్ చేస్తోంది... ఈ విష‌యం పెద్ద పెద్ద వార్త‌లుగా ప్ర‌చారం చేస్తోంది..సైకిల్ మైలేజ్ త‌గ్గిపోవ‌డంతో జాకీలెట్టిలేపుతోంది ఆస్ధాన మీడియా సైకిల్ పార్టీని.
 
తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు మోదీతో మాట్లాడిన స‌మ‌యంలో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు తో జ‌గ‌న్ విష‌యం ప్ర‌స్తావించార‌ట మోదీ.. ఇది  చంద్ర‌బాబు నాయ‌కుల‌కు ఓ విధంగా చెబితే దానిని తెలుగుదేశం ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు మ‌రో విధంగా ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేశారు.. చంద్ర‌బాబు చెప్పిన అంశం వేరుగా నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేయ‌డంతో ఇప్పుడు ఆస్దాన మీడియాకు బాధ క‌లిగింది.. తెలుగుదేశానికి మ‌చ్చ తెస్తున్నార‌ని నాయ‌కులు బాధ‌ప‌డుతున్నార‌ని, అదిష్టానం ఆలోచ‌న‌లో ప‌డింది అని క్షోభిస్తోంది ప‌చ్చ ప‌త్రిక‌.
 
రెండు రోజుల క్రితం చంద్ర‌బాబు ఎమ్మెల్యేల‌తో మాట్లాడిన స‌మ‌యంలో ఎన్డీయేతో తెలుగుదేశం బ‌య‌ట‌కు రావ‌డానికి గ‌ల కార‌ణాలు తెలియ‌చేశార‌ట ఓసారి అది ప‌రిశీలిస్తే... కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దానిని సరిచేస్తారేమోనిని ఎదురుచూసినప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో మ‌న  కేంద్రమంత్రులతో రాజీనామా చేయాలని నిర్ణ‌యించాం అని తెలియ‌చేశారు.. ఈ విష‌యాన్ని  ప్రధాని మోదీకి వివరించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఆయన అందుబాటులోకి రాలేదట‌.
 
మరుసటి రోజు ఉదయం కేంద్రమంత్రులు రాజీనామాలకు సిద్ధమయ్యారు ఇక సాయంత్రం మోదీ చంద్రబాబుకు ఫోన్ చేశారు. రాజీనామా చేస్తున్నట్లు బాబు ఆయనకి చెప్పారు. కొంతకాలం ఆగితే బాగుంటుందని మోదీ చెప్పార‌ట‌, నాలుగు సంవత్సరాలు ఆగామనీ, ప్రజల నుంచి తీవ్ర వత్తిడి వస్తోందనీ, మేము ఇంకా ఎన్‌డీఏలో ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలనీ చంద్రబాబు మోదీకి చెప్పారట‌. ఈ రాజీనామాల వల్ల జగన్ బలపడే అవకాశం ఉంది కదా? అని మోదీ తనతో వ్యాఖ్యానించారని చంద్రబాబు టీడీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు వివరించారని ఆ మీడియా ప‌త్రిక తెలియ‌చేసింది.
 
దీనివల్ల వైసీపీ బలపడుతుందనీ, ఎన్‌డీఏకి నష్టమనీ, ప్రత్యేకహోదా కోసం ఇప్పుడు రాజీనామా చేయడం బాగోలేదనీ మోదీ తనతో చెప్పారని అంటూ "ప్రధాని మోదీ, జగన్‌ల మధ్య ఉన్న సంబంధాలేంటో ఆయన మాటల వల్లే తెలిసిపోతోందని'' ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించారని తెలిపింది. ఈ పరిణామం చోటుచేసుకునే సమయానికే బీజేపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య ఒక అవగాహన ఉందేమోనన్న అనుమానాన్ని కూడా వ్యక్తంచేశారు.
 
అయితే రామాయ‌ణం అంతా విని సీత రాముడికి ఏమౌతుంది అని అడిగిన‌ట్టు....  దీనిని తెలుగుదేశం నాయ‌కులు వేరే విధంగా తెలియ‌చేశారు ప్ర‌జ‌ల‌కు....జగన్ ఇప్పటికే రాష్ట్రంలో బలపడ్డారనీ, మీ రాజీనామాల వల్ల అతను మరింత బలపడతారనీ, ప్రత్యేకహోదా ఉద్యమం వల్ల లాభం వైసీపీకే ఉంటుందనీ ప్రధాని మోదీ చంద్రబాబుతో చెప్పారంటూ టీడీపీలోని కొంతమంది ఎమ్మెల్యేలు ఆఫ్ ద రికార్డ్‌గా చెబుతున్నారు.  దీంతో ఉన్నా ప‌రువును కాస్త తెలుగుదేశం ఎమ్మెల్యేలు బ‌య‌ట‌పెట్టార‌ట, దీంతో అధిష్టానం గుర్రుగా ఉంది ఈ విష‌యాన్ని నాయ‌కులు ప‌రిశీలిస్తున్నారు డ్యామేజ్ త‌గ్గ‌కుండా ఇమేజ్ పాడ‌వ‌కుండా నివార‌ణ చ‌ర్య‌లు ఆలోచిస్తోంది పార్టీ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.