జ‌గ‌న్ పుస్త‌కంతో మోదీ కొత్త ప్లాన్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

modi jagan image
Updated:  2018-03-31 12:31:48

జ‌గ‌న్ పుస్త‌కంతో మోదీ కొత్త ప్లాన్ ?

కేంద్రంతో క‌లిసి ఉన్నా క‌లిసి లేక‌పోయినా ఏపీకి ఇస్తాము అన్న అన్నీ హామీలు కేంద్రం ఇచ్చి తీరాల్సిందే... ఇది  ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత టీడీపీ అన్నా మాట‌. అయితే ఏప్రిల్ 2-3 తేదీల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హ‌స్తిన ప్ర‌యాణానికి వెళుతున్నారు, అయితే మ‌రో నాలుగు రోజుల్లో పార్ల‌మెంట్ స‌మావేశాలే ముగియ‌నున్నాయి ఈ స‌మ‌యంలో అవిశ్వాసానికి మిగిలిన పార్టీల స‌పోర్టుకు చంద్ర‌బాబు వెళుతున్నారా అంటే అదీ కాదు, మ‌రీ  అన్నా డీఎంకే ఎంపీల పోరు కావేరీ బోర్డు ఏర్పాటుకా  అంటే అదీ కాదు.. బాబు హ‌స్తిన వెళ్ల‌డం లేద‌ట ఇప్ప‌టికే వైసీపీ నాయ‌కులు కూడా బాబు హాడావుడిగా ఎందుకు ఢిల్లీ వెళుతున్నారు అంటే స‌మాధానం చెప్ప‌డం లేదు.
 
ఇక్క‌డ పార్టీ ప్ర‌జ‌ల‌కు చెప్పేది ఒక‌టి... ఆస్ధాన మీడియా చూపించేది ఒక‌టి ...అక్క‌డ హస్తిన‌లో భేరం ఒక‌టి అంటున్నారు వైసీపీ నాయ‌కులు. మొత్తానికి బీజేపీ మాకు ఎంత అన్యాయం చేసింది... నా క‌ష్టంతో ఇక్క‌డ గెలిస్తే త‌మ‌ని తొక్కి ఇక్క‌డ ఎద‌గాలి అని బీజేపీ ప్లాన్ వేస్తోంది అని బాబు హ‌స్తిన‌లో అన్ని పార్టీల నాయ‌కుల‌తో చ‌ర్చించ‌నున్నారట‌.... అలాగే ఏపీకి కేంద్రం ఇస్తాను అన్న‌ది ఏమిటి.  ఇచ్చింది ఏమిటి . ఇవ్వాల్సింది ఏమిటి? అనేది పుస్త‌కాల‌తో స‌హా తీసుకువెళుతున్నార‌ట చంద్ర‌బాబు.
 
రాజ‌ధాని నిర్మాణం పై అనేక విమ‌ర్శ‌లు చేశారు ఇప్ప‌టీకే వైసీపీ బీజేపీ నాయ‌కులు.. ప‌లు ఆధారాలు చూపించారు ప్ర‌జ‌ల‌కు.. అలాగే పోల‌వ‌రం ప‌ట్టిసీమ నిధులు, ఇసుక కుంభ‌కోణాలు, విశాఖ భూ కుంభ‌కోణం తెలుగుదేశం నాయ‌కుల పై వ‌చ్చిన అవినీతి విమ‌ర్శ‌లు ప్రాజెక్టుల అంచ‌నాలు పెంచ‌డం ఇవ‌న్నీ కేంద్రం ద‌గ్గ‌ర సాక్ష్యాధారాల‌తో స‌హా ఉన్నాయ‌ట...
 
 
అంతేకాదు జ‌గ‌న్ కూడా బాబు చేసిన అక్ర‌మాలు అవినీతికి సంబంధించి ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌ పుస్తకంలో ఆధారాలతో సహా అన్ని కేంద్రానికి స‌మ‌ర్పించారు... ఈ రెండిటితో కేంద్రం విచార‌ణ సంస్ద‌ల‌ను ఏపీకి పంపనుంది అనే సాల్ట్  తెలుగుదేశానికి వ‌చ్చింది ...దీంతో పార్టీ ఉనికికి డ్యామేజ్ ప‌డుతుంది అని హ‌స్తిన ప్ర‌యాణం పెట్టుకున్నారు అని అంటున్నారు నాయ‌కులు... అయితే అరుణ్ జైట్లీ - అలాగే కుదిరితే అమిత్ షాతో చ‌ర్చించాల‌ని చూస్తున్నార‌ట అధినేత ,   ఓ మాజీ కేంద్ర‌మంత్రి ద్వారా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు అని అంటున్నారు... మ‌రి చూడాలి ఏప్రిల్ 2 -3 న రాజ‌కీయం ఎటువంటి మలుపులు తిరుగుతుందో... జ‌గ‌న్ పుస్త‌కం మోదీకి ఓ పెద్ద అస్త్రంగా మారుతుంది అంటున్నారు సీనియ‌ర్ విశ్లేష‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.