వైసీపీకి జై కొట్ట‌నున్న మంచు ఫ్యామిలీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-08 01:37:57

వైసీపీకి జై కొట్ట‌నున్న మంచు ఫ్యామిలీ

బంధువుల రాజ‌కీయాలు  ఇటీవ‌ల రాజ‌కీయాల్లో కామ‌న్ అయిపోయాయి, ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే బంధుత్వాల చుట్టూ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి.. అఫ్ కోర్స్ ప‌ద‌వులు కూడా అలాగే వ‌రిస్తున్నాయి.. ఇక్కడ తెలుగుదేశం వైసీపీలో బంధుత్వాలు పార్టీ రాజ‌కీయాల్లో మేజ‌ర్ పాత్ర పోషిస్తున్నాయి.
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో టాలీవుడ్ ప్ర‌ముఖులు చాలా మంది రాజ‌కీయ అరంగేట్రం చేయాలి  అని, అలాగే రాజ‌కీయంగా స్ధ‌బ్దుగా ఉన్న నాయ‌కులు మ‌ళ్లీ రీఎంట్రీ ఇవ్వాలి అని చూస్తున్నారు.. అయితే ఆ స‌మ‌యానికి మ‌రో 12 నెల‌లు మాత్ర‌మే ఉంది... వైసీపీ త‌ర‌పున నాయ‌కులను తెలుగుదేశం లోకి పార్టీ ఫిరాయిస్తూ తెలుగుదేశంలోకి చేర్చుకున్నారు పార్టీ అధినేత... ఇక ఉన్నావారికే పార్టీలో సీట్లు ఇవ్వ‌లేని స్ధితిలో తెలుగుదేశం ఉంది.. ఇక నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న కూడా జ‌రిగే అవ‌కాశం లేదు, దీంతో పార్టీలో ఉన్న నాయ‌కులు ఎటువంటి స్ధితిలో ఉన్నారో ఇట్టే అర్దం అవుతోంది.
 
అందుకే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు బాబు ఫుల్ స్టాప్ పెట్టారు.. ఇప్పుడు తాజాగా మంచు ఫ్యామిలీ గురించి వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.. మంచు మోహన్ బాబు గ‌తంలోనే రాజ‌కీయాల్లో ఉన్నారు, కాస్త స్ధ‌బ్దుత వ‌హించారు ఎన్టీఆర్ మ‌ర‌ణం త‌ర్వాత‌.... అయితే ఇప్పుడు తాజాగా ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావాలి అని నిర్ణ‌యించుకున్నారు.. ఇటీవ‌ల  ఇంట‌ర్వూలో కూడా ఆయ‌న త‌న మ‌న‌సులో మాట తెలిపారు, అయితే తాజాగా వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం, ఆయ‌న‌కు ఫిరాయింపులు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఘ‌ట‌న‌లు ఇప్ప‌టికీ బాధిస్తాయట.. అందుకే ఆయ‌న వైసీపీలోకి త‌న పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తారు అని అంటున్నారు కొంద‌రు సీనియ‌ర్లు...ఇటు శ్రీకాళ‌హస్తి సెగ్మెంట్ నుంచి ఆయ‌న‌కు కాస్త ప‌ట్టు ఉండ‌టంతో, సొంత జిల్లా కావ‌డం, ఆయ‌న  విద్యాసంస్ధ‌లకు మొద‌టి నిల‌యం కావ‌డం, ఆయ‌న రాజ‌కీయంగా వైసీపీ త‌ర‌పున అక్క‌డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అనే వార్త‌లకు మ‌రింత బ‌లం చేకూరుస్తున్నాయి.
 
అయితే ఆయన ఎంత మండిప‌డినా మృదు మ‌న‌స్వ‌భావి, ఏదిఅయినా ఖ‌రాకండిగా చెప్పే మ‌న‌స్త‌త్వం ఉండ‌టంతో ఆయ‌న‌కు ప్ర‌జా మ‌ద్ద‌తు ఉంటుంది అని, రాజ‌కీయంగా సేవాత‌త్పుర‌త ఉండ‌టం కూడా ఆయ‌న‌కు ప్ల‌స్ అవుతుంది అని.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆయ‌న పొలిటిక‌ల్ గా వైసీపీలో చేరే అవ‌కాశం ఉందిఅనే వార్త‌లు  గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.