జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసిన మోహ‌న్ బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and mohan babu
Updated:  2018-11-02 03:11:58

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసిన మోహ‌న్ బాబు

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై శ్రీనివాసరావు అనే వ్య‌క్తి దాడికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ దాడిలో  తీవ్రంగా గాయ‌ప‌డిన జ‌గ‌న్ కు తాజాగా డాక్ట‌ర్లు చికిత్స చేశారు. అల్యూమినియం చెందిన‌ క‌త్తితో పొడ‌వ‌డంతో జ‌గ‌న్ కు త‌గిలిన గాయం ఇంకా మాన‌లేద‌ని డాక్ట‌ర్లు నిర్దారించారు. దీంతో జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర మ‌రికొద్దిరోజుల‌కు వాయిదా ప‌డింది. 
 
వాస్త‌వానికి ఈ రోజు జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తార‌ని పార్టీ వ‌ర్గాలు కొద్దిరోజుల క్రితం ఒక ప్ర‌క‌ట‌న కూడా చేశారు. అయితే తాజాగా  జ‌గ‌న్ కు త‌గిలిన గాయాన్నివైద్యులు ప‌రీక్షించి మ‌రికొద్ది రోజులు పాద‌యాత్ర వాయిదా వేయాల‌ని సుచించారు. దీంతో జ‌గ‌న్ డాక్ట‌ర్లు, పార్టీనేత‌ల కోరిక మేర‌కు పాద‌యాత్ర‌ను వాయిదా వేశారు. ఈ క్రమంలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాసంలో సినీన‌టుడు, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు మోహ‌న్ బాబు క‌లిసి ప‌రామ‌ర్శించారు. 
 
ఆ త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ వందేళ్ల‌పాటు ఆరోగ్యంగా ఉంటార‌ని, అలాగే ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ దేవున్ని మ‌న‌సారా కోరుకుంటున్నాన‌ని అన్నారు మోహ‌న్ బాబు. అంతేకాదు స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తుపై మాట్ల‌డుతాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.