చంద్ర‌బాబు తో అందుకే విభేదాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-05 02:41:25

చంద్ర‌బాబు తో అందుకే విభేదాలు

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు రూటే స‌ప‌రేటు ఇటు రాజ‌కీయాల్లో అయినా సినిమాల్లో అయినా.. ఆయ‌న దాటి వాగ్దాటి చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది.. ముక్కుసూటి మ‌నిషిగా మోహ‌న్ బాబును పిలుస్తారు, అయితే మోహ‌న్ బాబు ఇటీవ‌ల సినిమాల‌ను  కూడా చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు, ఓ ప‌క్క రాజ‌కీయాల పై, ఇటు సినిమాల‌పై ఆయ‌న చేసే కామెంట్లు రెండు వ‌ర్గాల‌లో కాక‌పుట్టించేవి... గ‌తంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పై ఆయ‌న చేసిన కామెంట్లు ఇటు ఫిరాయింపుల‌కు వెల్ కం చెప్పిన తెలుగుదేశం పై, ఆయ‌న విసుర్లు పొలిటిక‌ల్ గా వైర‌ల్ అయ్యాయి.
 
ఇటీవ‌ల ఆయ‌న పొలిటిక‌ల్ గా యాక్టీవ్ అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.. తాజాగా ఆయ‌న ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలియ‌చేశారు.. తాను పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తాన‌ని, అయితే ఇటు చంద్ర‌బాబు పై త‌న వైఖ‌రి ఏమిటో కూడా తెలిపారు మోహ‌న్ బాబు .... తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు గురించి ఎటువంటి క్వ‌శ్చన్స్ అడిగానా, స‌మాధానంగా గ‌తంలో అని అలాగే ఒక‌ప్పుడు అని మాత్ర‌మే స‌మాధానాలు ఇచ్చారు.
 
అయితే హెరిటేజ్ లో షేర్లు ఉన్నాయా అని అడిగితే, గ‌తంలో ఉండేవని, క‌లిసి వ్యాపారం చేశామ‌ని, కాని  కొన్ని విష‌యాల‌లో మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డంతో తాను త‌ప్పుకున్నాను అన్నారు.. అయితే ఇటు పొలిటిక‌ల్ గా ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రాజ‌కీయాల గురించి మాట్లాడ‌తా అని అన్నారు.. అవ‌స‌రం అయితే ఏ నాయ‌కుడి గురించి అయినా  చెబుతా అన్నారు.. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ స‌భ‌లు- స‌మావేశాలు తెలుగువారిని ఏకం చేస్తున్నార‌ని, అక్క‌డ అమ‌రావ‌తిలో అటువంటిది జ‌రగ‌డం లేదు అని, అందుకే ఇక్క‌డ కేసీఆర్ ని కీర్తిస్తున్నామ‌ని త‌న మ‌న‌సులో మాట చెప్పారు మోహ‌న్ బాబు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.