చంద్ర‌బాబుపై మోహ‌న్ బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

mohanbabu chandrababu
Updated:  2018-04-01 12:21:24

చంద్ర‌బాబుపై మోహ‌న్ బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ఇటు సినిమాలు కానీ అటు రాజ‌కీయాలు కానీ ప‌రిచ‌యం అక్కర్లేని వ్య‌క్తి... ఎలాంటి విష‌యం అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు మోహ‌న్ బాబు...అయితే ఇప్ప‌టికే రాజ‌కీయ నాయ‌కులు 100 కి 95 శాతం అంద‌రు దొంగ రాజ‌కీయాలు చేసి ప్ర‌జ‌ల‌ను నిలువునా ముంచేస్తున్నారంటూ ప‌లు   సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి మ‌నంద‌నికీ తెలిసిందే.
 
 
అయితే తాజాగా మోహ‌న్ బాబు ఓ ప్ర‌ముఖ యూట్యూబ్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో... ఏపీ ముఖ్యంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... 2014ఎన్నిక‌ల ప్ర‌చారంలో సుమారు 600 వంద‌ల‌కు పైగా హామీలను ప్ర‌జ‌ల‌కు ప్ర‌క‌టించి అధికారాన్ని ద‌క్కించుకున్న చంద్ర‌బాబు...  నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డిచినా కానీ ఇంత‌వ‌ర‌కూ ఒక్క హామీ కూడా ప్ర‌జ‌ల‌కు అమ‌లు ప‌ర‌చ‌లేద‌ని మండిప‌డ్డారు మోహ‌న్ బాబు. 
 
అందులో భాగంగానే చంద్ర‌బాబు చేసే బ్రోక‌ర్ ప‌నులు ప్ర‌పంచంలో మ‌రే రాజ‌కీయ నాయ‌కుడు చేయ‌ర‌ని అన్నారు... వేరే పార్టీలో అత్య‌ధిక మెజార్టీతో గెలిచిన నాయ‌కుల‌ను అన్యాయంగా త‌న పార్టీలో చేర్చుకుని, అలాగే వారికి రాజ్యాంగ విరుద్దంగా మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన‌ ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కుతుంద‌ని అన్నారు... పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి చావుకు కారణమైన చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తున్న వారా... ఇండస్ట్రీ వాళ్ళను తిట్టేది అంటూ మండిప‌డ్డారు మోహన్ బాబు... ప్ర‌జ‌లు న‌మ్మి మీకు ఓట్లు వేస్తే మీరు వారిని నిలువునా దోచుకుంటారా అని అన్నారు...మేము త‌లుచుకుంటే టీడీపీకి డిపాజిట్లు కూడా రావ‌ని తెలిపారు... మమ్మల్ని మీ స్వార్ధ రాజకీయాల్లోకి లాగ‌కండి అని అన్నారు
 
నిజంగా రాష్ట్రానికి మా వ‌ల్ల మేలు జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లు భావిస్తే వారు ప్ర‌త్యేక హోదాకోసం పోరాటం చేయ‌మంటే త‌ప్ప‌ని స‌రిగా తాను ముందుకు వ‌స్తాన‌ని తెలిపారు క‌లెక్ష‌న్ కింగ్...  అంతే త‌ప్ప ఏ రాజ‌కీయ‌నాయ‌కుడు పిలిచినా తాము వెళ్ల‌మ‌ని స్ప‌ష్టం చేశారు.
 
దీంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మీరు వైసీపీ త‌రపున పోటీ చేస్తారా అని మోహ‌న్ బాబును మీడియా ప్ర‌తినిథి అడిగారు.. అందుకు ఆయ‌న స‌మాధానం ఇస్తూ త‌న‌కు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ త‌ర‌పున అసెంబ్లీ సీటు ఇచ్చినా ఇవ్వ‌కున్నా కానీ తాను మాత్రం ఆ పార్టీ త‌ర‌పున వ‌చ్చే సార్వ‌త్రికి ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తాన‌ని అన్నారు...  వైఎస్ కి తాను చాలా రుణపడి ఉన్నాన‌ని అలాంటి మంచి వ్యక్తి తనయుడు కి నావంతు కృషిగా భావించి నేను వెనుక ఉండి నడిపిస్తానని అన్నారు మోహ‌న్ బాబు..
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.