మోహ‌న్ బాబు సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

mohan babu tweet
Updated:  2018-03-22 04:43:39

మోహ‌న్ బాబు సంచ‌ల‌న ట్వీట్

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మకు ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి...ఎలాంటి విష‌యాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడే వ్య‌క్తి మోహ‌న్ బాబు.... ఇటు రాజ‌కీయ నాయ‌కుల‌ను అటు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తుల‌పైన ఎలాంటి మొహ‌మాటం లేకుండా మాట్లాడుతారు.... అయితే ఇప్ప‌టికే రాజ‌కీయ నాయ‌కుల‌పై అనేక సార్లు మీడియా ముందు  విమ‌ర్శించి వార్త‌ల్లో నిలిచారు మోహ‌న్ బాబు.. ప్ర‌తీ ఒక్క రాజ‌కీయ నాయ‌కుడు అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని, ఒక్క‌రు కూడా నీతి నిజాయితీ లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.
 
తాజాగా మీడియా ముందు ప్ర‌శ్నించ‌కుండా డైరెక్ట్ గా త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో పేరు ప్ర‌స్తావించ‌కుండా త‌న‌దైన శైలిలో కౌంట‌రిస్తూ విమ‌ర్శ‌లు చేశారు మోహ‌న్ బాబు.. మనిషికి ఉన్నది ఒకే ఒక పొట్ట, దానికి కావలసింది రెండు పూట్లా తిండి, కానీ మీరు మీ బిడ్డలకు బిడ్డల బిడ్డలకూ కావలసినంత దోచుకుంటున్నార‌న్నారు... అలాగే  దేశంలో బ్యాంకులు చాలక స్విస్ బ్యాంకుల్లో దేశ సంపదని దాచిపెట్టుకుంటున్నారు ఒరేయ్ ! ఎంత సంపాదించినా చివరకు మిగిలేది ఆరు అడుగుల‌ నేల గుప్పెడు బూడిద అంటూ ప‌రోక్షంగా రాజ‌కీయ నాయ‌కుల‌పై మోహ‌న్ బాబు ట్వీట్ చేశారు.
 
అయితే నెటిజ‌న్లు మాత్రం ఈ ట్వీట్ క‌చ్చితంగా తెలుగు దేశం పార్టీ నాయ‌కుల‌ను ఉద్దేశించి మోహ‌న్ బాబు పోస్ట్ పెట్టి ఉంటార‌ని అంటున్నారు.. ఎందుకంటే 2014 లో టీడీపీ నాయ‌కులు అధికారాన్ని ద‌క్కించుకున్న‌ప్ప‌టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విచ్చ‌ల విడిగా అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, నెటిజ‌న్లు అంటున్నారు... మ‌రి మోహ‌న్ బాబు త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో పెట్టిన పోస్ట్ పై టీడీపీ నాయ‌కులు స్పందిస్తారా లేక త‌మ‌ను కాదులే ! అని సైలెంట్ గా ఉంటారా అన్న‌ది ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.