2019లో చంద్ర‌బాబు ఓడిపోవాలి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-06-13 04:09:55

2019లో చంద్ర‌బాబు ఓడిపోవాలి

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చ‌ద్ర‌బాబు నాయుడుపై ప్ర‌తిప‌క్షాల‌తో పాటు నాలుగు సంవ‌త్స‌రాలు మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిచిన జ‌న‌సేన, బీజేపీ నాయ‌కులు కూడా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే.ఇక తాజాగా ఆ పార్టీ అసంతృప్తి నేత మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తూనే వున్నారు.
 
అయితే ఇదే క్ర‌మంలో యాదాద్రి జిల్లా ఆలేరులో మ‌రోసారి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, 2014లో చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను అవినీతి ఆంధ్ర‌ప్ర‌దేశ్ గా మార్చార‌ని మోత్కుప‌ల్లి ధ్వ‌జ‌మెత్తారు. ఎప్పుడు అయితే తెలుగుదేశం పార్టీ చంద్ర‌బాబు చేతిలో ప‌డిందో అప్ప‌టినుంచి దుర్మార్గ‌పు పార్టీలా మార్చార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.
 
మాజీ ముఖ్య‌మంత్రి టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు ఏ ఉద్దేశ్యంతో పార్టీ స్థాపించారో ఆయ‌న ఆశ‌లని చంద్ర‌బాబు నాశ‌నం చేశార‌ని మోత్కుప‌ల్లి మండిప‌డ్డారు. త‌న‌కు రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చిన రామారావును త‌న ప్రాణం ఉన్నంత వ‌ర‌కూ ఆరాదిస్తూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. టీడీపీలో అన్న‌గారి ప‌రిపాల‌న సాగాలంటే చంద్ర‌బాబు తిరిగి టీడీపీని నంద‌మూరి ఫ్యామిలీకి ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశారు.
 
ఓటుకు నోట్ల కేసులో అడ్డంగా దొంగ‌లా దొరికిన చంద్ర‌బాబుపై అలాగే రేవంత్ రెడ్డిల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఓటుకు నోటు కేసుపై అధికారులు సీబీఐ విచార‌ణ చేస్తే ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు  జైలుకు వెళ్తార‌ని అయ‌న అన్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదాపై కూడా స్పందించారు మోత్కుప‌ల్లి. హోదా సాధ‌న కోసం మొద‌టి నుంచి కేంద్రంతో ఫైట్ చేస్తోంది వైఎస్ జ‌గ‌న్ అనే అన్నారు. చంద్ర‌బాబు నాయుడు అధికారంతో కాపులకు, బీసీలకు, బ్రాహ్మణులకు గొడవ పెట్టేందుకు రెడి అవుతున్నార‌ని విమ‌ర్శించారు.
 
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదని, ఈ వ్యవస్థలో చంద్ర‌బాబు అనే చీడ‌పురుగును త్వ‌ర‌లో ప్ర‌జ‌లు త‌రిమికొడ‌తార‌ని అన్నారు. అలాగే త‌న‌కు మోకాళ్ల‌నొప్పి ఉంద‌ని అయినా కూడా తిరుప‌తి మెట్లు ఎక్కి చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడిపోవాల‌ని తాను వేంక‌టేశ్వ‌ర స్వామికి మొక్కుతాన‌ని మోత్కుపల్లి స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.