చంద్ర‌బాబు నీకు దమ్ము దైర్యం ఉంటే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-15 17:09:35

చంద్ర‌బాబు నీకు దమ్ము దైర్యం ఉంటే

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చ‌ద్ర‌బాబు నాయుడుపై ఆ పార్టీ అసంతృప్త నేత మోత్కుపల్లి నర్సింహులు గత కొద్దీ రోజులుగా చంద్ర‌బాబు నాయుడిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్రబాబు గురించి, టీడీపీ గురించి కొన్ని విషయాలను బట్టబయలు చేస్తున్నారు... చంద్రబాబు చేస్తున్న మోసాలను మీడియా ముఖంగా ఎండగడుతున్నారు మోత్కుపల్లి..
 
2014లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత కులాల మ‌ధ్య‌ చిచ్చుపెట్టే కార్య‌క్రామ‌లు చేస్తున్నార‌ని మోత్కుప‌ల్లి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబును న‌మ్మ‌వ‌ద్ద‌ని త‌న‌కు చెప్పార‌ని అన్నారు. చంద్ర‌బాబు రాజ‌కీయంలోకి వ‌చ్చి సుమారు 40 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్నార‌ని. అయితే ఇంత‌వ‌ర‌కు సొంత‌పార్టీని నిర్మించ‌లేదని విమ‌ర్శించారు.  ఏపీలో ప్ర‌ధాణ ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైఎస్ జ‌గ‌న్ సొంతంగా పార్టీ పెట్టార‌ని అన్నారు.
 
చంద్ర‌బాబు నాయుడుకు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ద‌మ్ము ధైర్యం ఉంటే ఎన్టీఆర్ జెండాను నంద‌మూరి ఫ్యామిలీకి ఇచ్చి సొంతంగా పోటీ చేయాల‌ని మోత్కుపల్లి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. ఇవాల టీడీపీకి నాలుగు ఓట్లు వ‌స్తున్నాయంటే అది దివంగ‌త‌నేత ఎన్టీఆర్ పూణ్య‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌మ నాయ‌కుడిని చంద్ర‌బాబు నాయుడు అల్లుడు పేరుతో చంపేశార‌ని మండిప‌డ్డారు. అధికారంతో చంద్ర‌బాబు నాయుడు విచ్చ‌ల‌విడిగా ప్ర‌జా ధ‌నాన్ని విదేశాల‌కు త‌ర‌లిస్తున్నార‌ని మండిప‌డ్డారు. 
 
త‌న‌కు రాజ్య‌స‌భ సీటును  ఇస్తాన‌ని చెప్పి టీజీ వెంక‌టేష్ కు వంద‌కోట్ల‌కు అమ్ముడు పోయార‌ని మోత్కుపల్లి విమ‌ర్శించారు. అయితే ఇప్ప‌టికిప్పుడు చంద్ర‌బాబు నాయుడుపై సీబీఐ విచార‌ణ చేస్తే ఖ‌చ్చితంగా జైలుకు పోతార‌ని ఆయ‌న అన్నారు. రాజ‌కీయాల మ‌నుగ‌డ కోసం నువ్వు ఎంత మంది ప్రాణాలు తీస్తావు చంద్ర‌బాబు అని మోత్కుపల్లి విమ‌ర్శించారు. నేను నీలాగా టీడీపీలో నీచ‌మైన రాజ‌కీయాలు చేయ‌లేద‌ని నేను స్వ‌చ్చ‌మైన రాజ‌కీయాలు చేశాన‌ని మోత్కుపల్లి స్ప‌ష్టం చేశారు..

 

ఇది ఇలా ఉంటె రాజ్యసభ సభ్యుడు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ సాగి దుర్గ ప్రసాద్ రాజు కలిసి మోత్కుపల్లికి మద్దతు తెలిపారు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.