ఓటుకు నోటు పై మోత్కుప‌ల్లి సంచ‌ల‌న కామెంట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

motkupalli   narsimhulu  comments  on  vote  for note
Updated:  2018-03-02 03:01:13

ఓటుకు నోటు పై మోత్కుప‌ల్లి సంచ‌ల‌న కామెంట్

తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియ‌ర్ నాయ‌కుడు మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.   తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ఎటువంటి ప‌రిస్ధితుల్లో ఉందో గుర్తించాలని అన్నారు ఆయ‌న‌..ఇక ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ స‌మావేశంలో చంద్ర‌బాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌ల పై మోత్కుప‌ల్లి స్పందించారు.. తాను లేకుండా కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసుకోవ‌డం చాలా బాధ క‌లిగించింద‌ని అన్నారు... చంద్ర‌బాబు ఎవ‌రిని అయితే న‌మ్మి తెలంగాణ సైకిల్ పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించారో, వారు పార్టీని  మోసం చేసి వెళ్లి పోయారని అన్నారు. 
 
తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ పార్టీలో  చేరిన రేవంత్‌రెడ్డి పై మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు... ఓటుకునోటుతో తెలుగుదేశం ప‌రువు రేవంత్ తీశార‌ని అస‌లు ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో రేవంత్ ని వెంట‌నే పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్లు అయితే బాగుండేద‌ని అన్నారు... అలా చేసిన‌ట్టు అయితే తెలంగాణ‌లో తెలుగుదేశం బ‌తికేది అని అన్నారు...టీఆర్‌ఎస్‌తో రేవంత్‌‌రెడ్డికి వైరం ఉండొచ్చు... కానీ నాకు లేదు అని మోత్కుపల్లి అన్నారు... ముందే టీఆర్ ఎస్ తో ఒప్పందం చేసుకుంటే మంచిది అని అన్నారు.
  
ఎన్టీఆర్ నుంచి చంద్ర‌బాబు వ‌ర‌కూ వారి వెనుకే ఉన్నా అని అన్నారు మోత్కుప‌ల్లి... కీల‌క స‌మ‌యాల్లో పార్టీకి సేవ చేశా కాని, త‌న‌కు గుర్తింపు లేద‌ని అన్నారు..చివరకు ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకున్న వ్యక్తి కూడా పార్టీని ముంచేసి పోయారని మోత్కుపల్లి విమ‌ర్శించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.