మోత్కుపల్లి సంచ‌లనం సంవ‌త్స‌రం నిరాహార దీక్ష చేస్తా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-30 17:46:52

మోత్కుపల్లి సంచ‌లనం సంవ‌త్స‌రం నిరాహార దీక్ష చేస్తా

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మ‌రోసారి త‌న నివాసంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నీచ రాజ‌కీయాలు చేయ‌డంలో చంద్ర‌బాబును మించిన రాజ‌కీయ నాయ‌కుడు ఈ దేశంలో వెతికినా దొర‌క‌ర‌ని మోత్కుపల్లి విమ‌ర్శించారు. 2014లో ఎన్నికల్లో చంద్ర‌బాబు ద‌ళితులు ఓట్లు వేస్తేనే అధికారంలోకి వ‌చ్చార‌ని కానీ, ఇప్పుడు ద‌ళితుల‌ను కించ‌ప‌రిచే విధంగా పుడుతూ పుడుతూ ద‌ళితులుగా ఎవ‌ర్వ‌రు పుట్టాల‌ని కోరుకుంటార‌ని, చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేశార‌ని మోత్కుపల్లి మండిప‌డ్డారు.
 
ఇప్పుడు ఎన్నికలు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో ద‌ళిత ఓట్లను రాబ‌ట్టుకునేందుకు చంద్ర‌బాబు నాయుడు ద‌ళిత తేజం పేరుతో మ‌రోసారి మోసానికి దిగార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. గ‌తంలో ఎస్సీల‌ను కించ‌ప‌రిచే విధంగా మాట్లాడిన ముఖ్య‌మంత్రి ఇప్పుడు నెల్లూరులో ద‌ళిత తేజం స‌భ ద్వారా ఎస్సీల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. చంద్ర‌బాబు అవ‌స‌రానికి వ‌స్తువుల‌ను వాడుకున్న‌ట్లు త‌న రాజ‌కీయ అవ‌స‌రానికి త‌న‌ను అలాగే ముద్దు కృష్ణమనాయుడిని వాడుకున్నార‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. 
 
తాను ఎన్టీఆర్ హ‌యాంలో అన్ని చూశాన‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఎలాంటి ప‌ద‌వులు అక్క‌ర్లేద‌ని త‌న జెండా ఎజెండా ఒక్క‌టే అది కేవ‌లం చంద్ర‌బాబు ఓడిపోవ‌డ‌మే అని స్ప‌ష్టం చేశారు. అందుకే తాను త‌న పుట్టిన రోజు జూలై 11వ తేదిన తిరుప‌తికి కాలిన‌డ‌క‌తో వెళ్లి చంద్ర‌బాబు ఓడిపోవాల‌ని మొక్కుకుంటాన‌ని మోత్కుపల్లి స్ప‌ష్టం చేశారు. త‌న‌కు మొకాళ్ల నొప్పి ఉన్నాకూడా క‌ష్ట‌ప‌డి తిరుప‌తి మెట్లు ఎక్కి చంద్ర‌బాబు ఓడిపోవాల‌ని వెంక‌టేశ్వ‌ర స్వామిని వేడుకుంటాన‌ని ఆయ‌న తెలిపారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ బ్ర‌తికున్న‌ప్పుడు త‌న‌కు చంద్ర‌బాబునాయుడిని న‌మ్మ‌కూడ‌ద‌ని చెప్పేవార‌ని మోత్కుపల్లి అన్నారు. టీడీపీలో చంద్ర‌బాబు నాయుడికంటే తాను సీనియ‌ర్ అని స్ప‌ష్టం చేశారు.
 
విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా రైల్వే జోన్ కోసం ప్ర‌తిప‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్ర‌మే పోరాడుతున్నార‌ని మోత్కుపల్లి స్ప‌ష్టం చేశారు. అయితే ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో చంద్ర‌బాబు నాయుడు ఓట్లును రాబ‌ట్టేందుకు సీఎం ర‌మేష్ తో దొంగ దీక్ష‌లు చేయిస్తున్నార‌ని మండిప‌డ్డారు.
 
ర‌మేష్ దీక్ష చేప‌ట్టి ఈ రోజుతో 11 రోజుల‌కు చేరింద‌ని కానీ ఆయ‌న ముఖంలో క‌ళ చెద‌రకుండా ఉంద‌ని మోత్కుపల్లి విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న దీక్ష చేసిట్లు తాను కూడా ఒక సంవ‌త్స‌రం  పాటు నిరాహార దీక్ష‌చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ దొంగ దీక్ష‌ను చూసి టీడీపీ ఎంపీలు కూడా చుల‌క‌న‌గా మ‌ట్లాడార‌ని స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు నాయుడుకి రాష్ట్ర ప్ర‌జ‌లు ఘోరి క‌ట్టే రోజులు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాయ‌ని మోత్కుపల్లి అన్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.