ఎంపీ అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-21 06:56:26

ఎంపీ అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

 తెలుగుదేశం పార్టీ అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం నాడు ఉండ‌వ‌ల్లిలో జ‌రిగిన టీడీపీ వ‌ర్క్ షాప్ లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎంపీలు, కీల‌క నాయ‌కులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా  ముఖ్య‌మంత్రి   చంద్ర‌బాబు నాయుడును ఉద్దేశించి అవంతీ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

మీకు సముద్రమంత సహనం ఉంది.... కానీ ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు..... మీ అంత సహనం ప్రజలకు లేదు. అవసరమైనప్పుడు తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఏపీ ప్రజలు ప్రతిదానికి తెలంగాణ ప్రజల్లా ఆందోళన చేయరు......... సమయం చూసి ఏపీ ప్రజలు సరైన  నిర్ణయం తీసుకుంటారంటూ  అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. 

ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు 42 సార్లు దిల్లీకి వెళ్లొచ్చారు. అయినా  విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలు ఒక్క‌టి కూడా  అమ‌లు కాలేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ బడ్జెట్ స‌మావేశాల్లో అయినా విభ‌జ‌న హామీలు అమ‌లుకు నోచుకోవాల‌ని అవంతీ శ్రీనివాస్ ఆవేశ‌పూరిత ప్ర‌సంగం చేశారు. 

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.